అయోధ్యలో కీలకఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. రామమందిర ప్రారంభోత్సవానికి ముందు అయోధ్యలో వేల కోట్ల అభివృద్ధి పనులను జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోదీ. ఇవాళ అయోధ్యలో పర్యటించనున్న మోదీ..15 వేల కోట్ల విలువైన అభివృద్ది పనులను ప్రారంభిస్తారు. ప్రధాని పర్యటన సందర్భంగా అయోధ్యలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. విశ్వవ్యాప్తంగా కోట్లాదిమంది రామ భక్తుల చిరకాల స్వప్నం సాకారం అవుతోంది. జనవరి 22న జరిగే విగ్రహా ప్రతిష్ఠాపనకు సర్వం సిద్దమవుతోంది. ఆధ్మాత్మిక విశ్వనగరి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. అయోధ్య రామాలయం ప్రారంభానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దానిలో భాగంగా.. ఇవాళ అయోధ్యలో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. 15 వేల కోట్ల విలువైన అభివృద్ది పనులను ప్రారంభిస్తారు. ఇవాళ ఉదయం 11గంటల 15 నిమిషాలకు అయోధ్య ధామ్ రైల్వేస్టేషన్, మధ్యాహ్నం12గంటల15 నిమిషాలకు ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించారు. ఒంటి గంట తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు ప్రధాని మోదీ. అక్కడి నుంచే సుమారు 15వేల 700 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, జాతికి అంకితం చేస్తారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అయోధ్య నగరం విద్యుత్ కాంతుల్లో మెరిసిపోయింది.
भगवान श्री राम की नगरी अयोध्या में विश्वस्तरीय इंफ्रास्ट्रक्चर के विकास, कनेक्टिविटी में सुधार और यहां की समृद्ध विरासत के संरक्षण के लिए हमारी सरकार कृतसंकल्प है। इसी दिशा में कल नवनिर्मित एयरपोर्ट और पुनर्विकसित रेलवे स्टेशन का उद्घाटन करूंगा। इसके साथ ही कई और विकास परियोजनाओं…
ఇవి కూడా చదవండి— Narendra Modi (@narendramodi) December 29, 2023
ప్రధాని మోదీకి టెంపుల్ టౌన్ ఘన స్వాగతం పలకబోతోంది. అయోధ్య వాసులతోపాటు దేశంలోని 1,400 మంది కళాకారులు దారిపొడవునా మోదీకి నీరాజనం పట్టనున్నారు. ఎయిర్‌పోర్ట్ నుంచి అయోధ్య ధామ్ రైల్వేస్టేషన్ వరకూ 40 స్టేజీలు ఏర్పాటు చేశారు. దేశంలోని పలు ప్రాంతాలను విచ్చేసిన కళాకారులు.. ఆయా స్టేజీల నుంచి వివిధ కళారూపాలను ప్రదర్శిస్తూ ప్రధాని మోదీకి సాదర స్వాగతం పలుకుతారు. అయోధ్యకు చెందిన వైభవ్ మిశ్రా శంఖానాదంతోనూ, కాశీకి చెందిన మోహిత్ మిశ్రా ఢమరు వాద్యంతోనూ ప్రధానికి ఘనస్వాగతం చెప్తారు. పలువురు కళాకారులు వారివారి నృత్యరీతులతో అలరించనున్నారు. అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్‌లో ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా పర్వవేక్షించారు యూపీ సీఎం యోగి. అయోధ్య ధామ్ రైల్వేస్టేషన్‌లో ఏర్పాట్లను రైల్వే శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ పరిశీలించారు.
మరోవైపు.. అయోధ్య పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ రెండు కొత్త అమృత్ భారత్ రైళ్లకు పచ్చజెండా ఊపనున్నారు. దర్బంగా- అయోధ్య- ఆనంద్ విహార్ టెర్మనల్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, మాల్డా టౌన్- బెంగళూరు టెర్మినస్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభిస్తారు. వాటితోపాటు.. మరో ఆరు వందే భారత్ రైళ్లను కూడా ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. ఇక.. దేశం నలుమూలల నుంచి అయోధ్య ధామ్‌కు ప్రతిరోజు 20 రైళ్లు నడిచేలా రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..