Ganga Aarti: నీట్‌ పరీక్షలో ర్యాంక్ కోసం నాలుగేళ్లుగా మహా గంగా హారతి.. ఓ విద్యార్ధి వింత గాథ!

|

Jun 16, 2023 | 6:11 PM

Uttar Pradesh News: మొదటి ప్రయత్నంలో నీట్‌ యూజీ క్లియర్‌ చేయడానికి ఓ విద్యార్ధి ఏకంగా నాలుగేళ్ల పాటు రోజూ గంగా నదికి పూజలు చేశాడు. చివరికి ఏం జరిగిందో.. అతను కోరుకున్నట్లు నీట్‌లో ర్యాంకు సాధించాడో లేదో.. అసలు అన్నేళ్లు గంగా నదికి పూజలు ఎలా చేయగిగాడో..

Ganga Aarti: నీట్‌ పరీక్షలో ర్యాంక్ కోసం నాలుగేళ్లుగా మహా గంగా హారతి.. ఓ విద్యార్ధి వింత గాథ!
Ganga Aarti
Follow us on

లక్నో: మొదటి ప్రయత్నంలో నీట్‌ యూజీ క్లియర్‌ చేయడానికి ఓ విద్యార్ధి ఏకంగా నాలుగేళ్ల పాటు రోజూ గంగా నదికి పూజలు చేశాడు. చివరికి ఏం జరిగిందో.. అతను కోరుకున్నట్లు నీట్‌లో ర్యాంకు సాధించాడో లేదో.. అసలు అన్నేళ్లు గంగా నదికి పూజలు ఎలా చేయగిగాడో.. ఆ కథేంటో తెలుసుకుందాం..

ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలోని కచ్లాకు చెందిన విభు ఉపాధ్యాయ్ అనే విద్యార్ధి మొదటి ప్రయత్నంలోనే నీట్ యూజీ పరీక్షలో ర్యాంకు కొట్టాలని భావించాడు. అందుకు దైవానుగ్రహం కావాలని భావించాడు. నాలుగేళ్లపాటు రోజూ సాయంత్రం గంగా హారతి ఇచ్చి పూజలు చేసేవాడు. కాశీలో కస్బా కచ్లాలోని భగీరథ్ ఘాట్ వద్ద 2019 నుంచి ప్రతీ రోజూ మహా గంగా హారతి ఇవ్వడం మొదలు పెట్టాడు. ఇలా విభు నాలుగేళ్ల పాటు పవిత్ర గంగానదికి పూజలు చేస్తూనే వచ్చాడు. ఓ వైపు నిబద్ధతతో పూజలు చేస్తూనే నీట్ పరీక్షకు శ్రద్ధగా ప్రిపేరయ్యాడు. ఎట్టకేలకు అతని కృషి ఫలించి తాజాగా నిర్వహించిన నీట్ పరీక్షలో 622వ ర్యాంకు కొట్టాడు.

అతని విజయ సాధనకు తన కుటుంబం అండగా నిలిచిందని విభు చెప్పుకొచ్చాడు. తల్లి సునీత శర్మ, తండ్రి నీరజ్ శర్మ కుమారుడి పట్టుదలకు మురిసిపోయారు. తండ్రి నీరజ్ శర్మ అలియాస్‌ హరేంద్ర ఉపాధ్యాయ కస్బా కచ్లాలోని శ్రీ గంగా ఆరతి సేవా సమితి భగీరథ్ ఘాట్ సభ్యుడు కూడా. విభు 2019 నుంచి మా గంగా హారతి చేస్తున్నాడని, తమ కుమారుడు నీట్‌లో ర్యాంకు సాధించడం పట్ల ఎంతో గర్వపడుతున్నానని మీడియాకు తెలిపాడు. కేవలం గంగా హారతి ఇవ్వడం వల్లనే విభు విజయం సాధించలేదని, తమ కుమారుడి పట్టుదల, అంకితభావం వల్లనే తాను అనుకున్నది సాధించగలిగాడని తెలిపాడు. విభు మాత్రమే కాదు అసాధారణ విజయాలు సాధించాలంటే అసమానమైన కృషి, సంకల్పబలం ఉన్నవారు ఎవరైనా తాము అనుకున్నది సాధించగలరు. మీరేమంటారు.. నిజమే కదా..!

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.