AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భర్త గొంతు నులిమి చంపిన భార్య.. శవాన్ని సంచిలో కుక్కి బైక్‌పై తరలింపు..!

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో 38 ఏళ్ల వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించినట్లు తెలిపారు. భూటా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫైజ్‌నగర్ గ్రామంలో పప్పు అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కేసులో అతని భార్య నర్గీస్, అదే గ్రామానికి చెందిన రాజా అలియాస్ రియాజ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

భర్త గొంతు నులిమి చంపిన భార్య.. శవాన్ని సంచిలో కుక్కి బైక్‌పై తరలింపు..!
Accused Arrested
Balaraju Goud
|

Updated on: Sep 18, 2026 | 10:16 PM

Share

బరేలీ: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో 38 ఏళ్ల వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించినట్లు తెలిపారు. భూటా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫైజ్‌నగర్ గ్రామంలో పప్పు అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కేసులో అతని భార్య నర్గీస్, అదే గ్రామానికి చెందిన రాజా అలియాస్ రియాజ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల కథనం ప్రకారం.. సెప్టెంబర్ 10వ తేదీ రాత్రి రాజా నర్గీస్‌ను కలవడానికి ఆమె ఇంటికి వచ్చిన సమయంలో పప్పు వారిని గమనించాడు. దీంతో పప్పుతో నర్గీస్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నర్గీస్, రాజా కలిసి పప్పును హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని పేర్కొన్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 11వ తేదీ అర్ధరాత్రి సమయంలో పప్పును నేలపై పడేసి, నర్గీస్ అతని కాళ్లు పట్టుకోగా.. రాజా తాడుతో అతని మెడను బిగించి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని ఓ సంచిలో కుక్కి మోటార్‌సైకిల్‌పై మీర్జాపూర్ బట్టీ ప్రాంతానికి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ ఓ కందకంలో మృతదేహాన్ని పడేసినట్లు పేర్కొన్నారు.

నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసులో ఆధారాలను సేకరించి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాజా అలియాస్ రియాజ్ విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు సీఓ సందీప్ సింగ్ వెల్లడించారు.

ఇదిలా ఉండగా.. పప్పు కుటుంబ సభ్యులు మాత్రం నర్గీస్, రాజా మధ్య చాలా కాలంగా సంబంధం ఉన్నట్లు ఆరోపిస్తున్నారు. పప్పు సోదరుడు బుందన్ ప్రకారం.. సుమారు నాలుగేళ్ల క్రితం బదౌన్ జిల్లాలో ఉన్న సమయంలోనే రాజా, నర్గీస్ పరిచయం ఏర్పడిందని తెలిపారు. అనంతరం పప్పు కుటుంబం ఫైజ్‌నగర్‌కు మారిన తర్వాత కూడా వారి పరిచయం కొనసాగిందని చెప్పారు.

పప్పు దర్జీగా పనిచేస్తూ తరచూ ఇంటికి దూరంగా ఉండేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సమయంలో నర్గీస్, రాజా తరచూ కలుసుకునేవారని, వారి సంబంధం గురించి పప్పుకు తెలిసి, నిలదీసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అయితే ఈ కేసులో హత్యకు సంబంధించిన పూర్తి కారణాలు, ఇతర అంశాలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కేసులోని ఆరోపణలు, సాక్ష్యాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us