Uttar Pradesh: పాకిస్తాన్ పౌరసత్వాన్ని దాచి తల్లీకూతుళ్ల ప్రభుత్వ ఉద్యోగం.. చర్యలు చేపట్టిన సర్కార్
మహిరా అలియాస్ ఫర్జానా 1979లో పాకిస్థాన్‌కు చెందిన సిబ్‌గత్ అలీతో వివాహం జరిగింది. పెళ్లయ్యాక భర్తతో కలిసి పాకిస్థాన్‌లో నివసించడం ప్రారంభించింది. మహీరా పాకిస్థానీ పౌరసత్వం పొందిన రెండేళ్ల తర్వాత..

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో తల్లి, కూతురు తమ పాకిస్థాన్ పౌరసత్వాన్ని దాచిపెట్టి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో హోం మంత్రిత్వ శాఖ వారిపై విచారణ చేపట్టింది. మహిళ రాంపూర్‌లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా, కుమార్తె కూడా బరేలీలో ఉపాధ్యాయురాలిగా నియమితులయ్యారు. కేసు విచారణ అనంతరం తల్లీ కూతుళ్లిద్దరినీ సస్పెండ్ చేసి, తొలగింపు చర్యలు ప్రారంభించారు. ఈ మొత్తం వ్యవహారంలో అధికారుల నిర్లక్ష్యం కారణంమని తెలుస్తోంది. దీంతో అధికారులపై కూడా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది.
రాంపూర్‌లోని మొహల్లా అతిష్‌బజన్‌లో నివాసం ఉంటున్న మహిరా అలియాస్ ఫర్జానా టీచర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. 1992లో ప్రాథమిక విద్యా విభాగంలో మహిరా టీచర్‌గా నియమితులయ్యారు. ఇక 2015లో, మాధౌపూర్‌లోని ఫతేగంజ్ ఈస్ట్‌లోని ప్రాథమిక పాఠశాలలో మహిరా కూతురు షుమేలా నియమితులయ్యారు. ఇన్నేళ్ల తర్వాత తల్లీకూతుర్లు ఇద్దరికి పాకిస్థాన్‌తో ఉన్న అనుబంధం బయటపడింది. ఈ అంశంపై విచారణకు ఒక శాఖ కమిటీని ఏర్పాటు చేసింది. విచారణలో మహిరా కు పాకిస్థాన్ తో సంబంధం ఉందని.. ఆ దేశ పౌరసత్వం కలిగి ఉందని వెలుగులోకి రావడంతో ఆ శాఖ చర్యలు చేపట్టింది. మహిరా అలియాస్ ఫర్జానాను సస్పెండ్ చేసింది. ఎస్పీ రాంపూర్ లేఖ అనంతరం ఈ విషయం బీఎస్‌ఏ బరేలీ దృష్టికి వచ్చింది.
పాకిస్థానీ యువతి మహిరా అలియాస్ ఫర్జానా 1979లో పాకిస్థాన్‌కు చెందిన సిబ్‌గత్ అలీతో వివాహం జరిగింది. పెళ్లయ్యాక భర్తతో కలిసి పాకిస్థాన్‌లో నివసించడం ప్రారంభించింది. మహీరా పాకిస్థానీ పౌరసత్వం పొందిన రెండేళ్ల తర్వాత.. ఆమె సిబ్గత్ అలీతో విడాకులు తీసుకుంది. పాకిస్తాన్ పాస్‌పోర్ట్‌పై ఇండియా వీసా పొందింది. అనంతరం మహిరా తన ఇద్దరు కుమార్తెలు షుమేలా ఖాన్ అలియాస్ ఫుర్కానా , అలీమాతో కలిసి భారతదేశానికి తిరిగి వచ్చి రాంపూర్‌లో నివసించడం ప్రారంభించింది. వీసా గడువు ముగిసినా ఆమె తిరిగి పాకిస్థాన్‌కు వెళ్లకపోవడంతో రాంపూర్‌లో ఎల్‌ఐయూ ఆమెపై కేసు నమోదు చేసింది. అనంతరం CJM కోర్టు మహిరాకు శిక్ష విధించింది. మెల్లగా ఈ విషయం మరుగున పడిపోయింది.




కాలక్రమంలో మహిరా విషయం అటకెక్కడంతో ఆమెను తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. అంతేకాదు మహీరా కూతురు షుమేలాకు కూడా ప్రాథమిక విద్యా విభాగంలో ఉద్యోగం వచ్చింది. ఈ విషయం గతేడాది ఎల్‌ఐయూ దృష్టికి వచ్చింది. దీంతో ఎస్పీ రాంపూర్ ఓ లేఖను రాశారు. దీంతో BSA బరేలీ రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించింది. షుమేలా ఫైల్ ఓపెన్ చేయగానే రాంపూర్‌లో మహిరా అలియాస్ ఫర్జానా ఫైల్ కూడా ఓపెన్ అయింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే మహీరాను ఉపాధ్యాయురాలిగా సస్పెండ్ చేశారు. ఆమె కుమార్తె షుమేలాను సస్పెండ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విషయమై ఎస్‌డిఎం సదర్ రాంపూర్‌కు లేఖ పంపినట్లు బిఎస్‌ఎ వినయ్‌కుమార్ తెలిపారు. ఇందులో షుమేలా సాధారణ నివాస ధృవీకరణ పత్రం తదితరాలను రద్దు చేయాలని కోరారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




