రైల్వే ప్రమాదాల గురించిన వార్తలు తరచుగా వింటూనే ఉన్నాం.. అగ్ని ప్రమాదం, రైలు బోగీలు పట్టాలు తప్పడం వంటి కారణాలతో ప్రమాదాలు జరగడం సర్వసాధారంగా వింటూనే ఉన్నాం.. అయితే ఇటీవల ఒక రైలు ప్రమాదం మాత్రం విచిత్రమనిపించింది. అంతేకాదు ఈ ప్రమాదానికి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొట్టింది కూడా.. ఎందుకంటే ఒక రైలు .. ఏకంగా రైల్వే ప్లాట్ ఫామ్ పైకి చేరుకుంది. దీంతో నెటిజన్లు రకరకాల ఫన్నీ కామెంట్స్ తో రైల్వే ప్రమాదాన్ని.. రైల్వే అధికారుల తీరుని నిరసిస్తూనే ఉన్నాయి. రైలు ప్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చిన ఘటనలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. వివరాల్లోకి వెళ్తే..
ఉత్తరప్రదేశ్‌లోని మధుర రైల్వేస్టేషన్‌లో ఇటీవల ఓ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ రైలు రైల్వే ప్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చిన ఘటనలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. షుకుర్ బస్తీ నుంచి బయలుదేరిన రైలు సెప్టెంబరు 26 మంగళవారం రాత్రి 10 గంటల 49 నిమిషాల సమయంలో మధుర రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ప్రయాణికులు దిగి వెళ్లిపోయిన తర్వాత ఒక్కసారిగా ట్రైన్ హఠాత్తుగా కదిలి వేగంగా ప్లాట్‌ఫాంపైకి దూసుకెళ్ళింది.
Mathura Train accident caught on camera pic.twitter.com/gLyvZMlRyT
— Harsh Tyagii (@tyagiih5) September 28, 2023
రైలు ఇలా ప్లాట్ ఫామ్ పై దూసుకెళ్లడానికి గల కారణాలపై రైల్వే అధికారులు దర్యాప్తు చేపట్టారు. తాజాగా ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలను వివరించారు. ప్రమాదం జరిగే సమయంలో రైలు ఇంజిన్‌లో ఉన్న సచిన్ అనే వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడు. అంతేకాదు ఫోన్ ని చూస్తూ తన బ్యాగ్‌ను ఇంజిన్ థ్రోటల్‌పై పెట్టాడు. ఒక్కసారిగా ఇంజిన్ ఆన్ అయి.. రైలు వేగంగా కదిలి ముందుకు దూసుకెళ్లినట్లు అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఇదే విషయంపై సచిన్ మాట్లాడుతూ.. ట్రైన్ యాక్సిడెంట్ జరగడంలో తన తప్పు ఏమీ లేదని.. తప్పంతా లోకోపైలట్ గోవింద్ హరిశర్మదే నని చెప్పాడు. గోవింద్ రైలు ఇంజిన్ ఆఫ్ చేయకుండా.. అందరికంటే ముందుగా వెళ్లిపోయాడని సచిన్.. అందుకే ఈ ప్రమాదం జరిగిందని సచిన్ లోకో పైలెట్ పై ఆరోపణలు చేశాడు.
Mathura local train ramming into platform: As per report of the probe team, negligent act of helper Sachin engrossed in mobile caused the accident. He put his bag on the throttle which put the train in motion at the dead end forcing it to climb the platform. Sachin's breath… pic.twitter.com/E9nShbnvjN
— Piyush Rai (@Benarasiyaa) September 28, 2023
ట్రైన్ ఇంజిన్ ఆన్‌లో ఉండడంతో తాను చూసుకోకుండా బ్యాగ్ పెట్టడంతోనే థ్రోటల్ కదిలి.. ట్రైన్ దూసుకెళ్లింది అని వెల్లడించాడు. అప్పటికే తాను స్పందించానని.. కానీ రైలు ముందుకు దూసుకెళ్లిందని పేర్కొన్నాడు. ఎమర్జెన్సీ బ్రేకులు వేసే లోపే రైలు స్టాపర్, పిల్లర్లను ఢీకొని ప్లాట్‌ఫాంపైకి చేరుకుందని చెప్పాడు సచిన్. అయితే రైల్వే అధికారులు ఈ ఘటనకు సంబంధించి సచిన్, లోకోపైలట్ గోవింద్ హరిశర్మ సహా మొత్తం ఐదుగురిని అధికారులు సస్పెండ్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..