UP Crime News: నా కోడిని ఎవరో చంపేశారు.. కేసు పెట్టి, పోస్టు మార్టం చేయమని డిమాండ్ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే తనయుడు..

Uttar Pradesh Crime News: మనకు అన్యాయం జరిగితే.. న్యాయం చేయమంటూ పోలీసులను ఆశ్రయిస్తాం.. ఇక మనం రూల్స్ తప్పితే.. పోలీసులు కేసులు పెట్టడం ఇది సర్వసాధారణంగా జరిగేదే.. అయితే కొన్ని కొన్ని సార్లు..

UP Crime News: నా కోడిని ఎవరో చంపేశారు.. కేసు పెట్టి, పోస్టు మార్టం చేయమని డిమాండ్ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే తనయుడు..
Up Crime News
Follow us
Surya Kala

|

Updated on: Sep 12, 2021 | 9:09 PM

Uttar Pradesh Crime News: మనకు అన్యాయం జరిగితే.. న్యాయం చేయమంటూ పోలీసులను ఆశ్రయిస్తాం.. ఇక మనం రూల్స్ తప్పితే.. పోలీసులు కేసులు పెట్టడం ఇది సర్వసాధారణంగా జరిగేదే.. అయితే కొన్ని కొన్ని సార్లు నా కుక్క పిల్ల తప్పిపోయింది అంటూ విదేశాల్లో కేసులు పెట్టడం సర్వసాధారణం అయితే మన దేశంలో మాత్రం ఇటువంటి కేసులు పెట్టడం విచిత్రం అయితే.. కరోనా నిబంధనలు పాటించడలేదని గణపతిని, కోడిపందాల్లో పాల్గొన్నాయంటూ పందెం కోళ్లను అరెస్ట్ చేసి.. పోలీసులు వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. అయితే తాజాగా ఓ వ్యక్తి.. పోలీసులకు ఓ విచిత్రమైన వింతైన ఫిర్యాదుని చేశాడు.  తన కోడిని ఎవరో చంపేశారు.. కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం చేసి తగిన న్యాయం చేయమని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. ఈ విచిత్రం ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

ఉత్తర్ ప్రదేశ్ లోని మహారాజ్‌గంజ్‌ జిల్లా సింధూరియన్‌ పోలీస్‌ స్టేషన్‌‌ ఓ వింత కేసు నమోదైంది. ఓ వ్యక్తి చచ్చిపోయిన కోడిని పట్టుకుని పోలీస్టేషన్త గడప ఎక్కాడు.. తన కోడిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు విషం పెట్టి చంపేశారని.. తాను ఈ విషయంపై ఫిర్యాదు చేయడానికి వచ్చానని చెప్పాడు. అంతేకాదు.. కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం నిర్వహించి నేరస్తులను పట్టుకోవాలని పోలీసులకు సలహా కూడా ఇచ్చాడు. కోడి కేసు విన్న పోలీసులు షాక్ తిన్నారు.. అయితే కాదు లేదు అని చెప్పలేకపోయారు.. ఎందుకంటే.. కోడి ని మర్డర్ చేశారంటూ వచ్చిన వ్యక్తి.. సామాన్యుడు కాదు..  సాక్ష్యాత్తు మాజీ ఎమ్మెల్యే తనయుడు మరి.. దీంతో పోలీసులు మరు మాట్లాడకుండా ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు.

పిప్ర కళ్యాణ్ గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే దుఖీ ప్రసాద్  కుమారుడు రాజ్ కుమార్ భారతి సింధూరియన్ పోలీస్ స్టేషన్‌లో తన పెంపుడు కోడి ని ఎవరో మర్డర్ చేశారని ఫిర్యాదు చేశారు. అంతేకాదు తానూ ఈ కోడిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నానని.. ఇప్పుడు ఎవరో విషం పెట్టి చంపేశారని, పోస్ట్ మార్టం చేయించి నిందితుడ్ని పట్టుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అంతేకాదు మనుషులకు చేసినట్టే కోడికి పోస్టుమార్టం చేయాలని అప్పుడు నిందితుడిని త్వరగా పట్టుకోవడానికి వీలవుతుందని పోలీసులకు ఓ ఉచిత సలహా కూడా ఇచ్చాడు.  పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత ఈ ఘటనపై రాజ్‌ కుమార్‌ భారతి స్పందించాడు. తాను పక్షుల ప్రేమికుడినని.. తన దగ్గర చిలుకలు, పావురాలు, కోళ్ల ఉన్నాయని.. వాటిని ఎంతో ముద్దుగా ప్రేమగా పెంచుకుంటున్నానని చెప్పాడు. తాను అంటే ఇష్టములేని వారు ఎవరో తన ముద్దుల కోడిని విషం పెట్టి చంపేశారంటూ వాపోయాడు. తన ముద్దుల కోడిని చంపేసిన నిందితులకు శిక్ష పడాలని కోరుతున్నాడు . ప్రస్తుతం ఈ కోడి కేసు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది.

Also Read: Lucky Temple Coconut: శివుడికి ప్రతిరూపం ఈ కొబ్బరికాయ అంటూ.. రూ.6.50 లక్షలకు కొన్న భక్తుడు.. ఎక్కడంటే..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే