భర్త రోజూ ఆలస్యంగా ఇంటికొస్తున్నాడనీ.. ఈ భార్య ఏం శిక్ష విధించిందో తెలుసా..?

|

Jan 31, 2023 | 4:55 PM

భర్త ప్రతిరోజూ రాత్రి ఇంటికి ఆలస్యం వస్తున్నాడని ముఖంపై యాసిడ్‌ పోసింది ఓ భార్య. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

భర్త రోజూ ఆలస్యంగా ఇంటికొస్తున్నాడనీ.. ఈ భార్య ఏం శిక్ష విధించిందో తెలుసా..?
Acid Attack
Follow us on

భర్త ప్రతిరోజూ రాత్రి ఇంటికి ఆలస్యం వస్తున్నాడని ముఖంపై యాసిడ్‌ పోసింది ఓ భార్య. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలోని కూపర్‌గంజ్ ప్రాంతంలో దబ్బు గుప్తా (40), పూనమ్‌ (35) దంపతులు కాపురం ఉంటున్నారు. ఐతే నిత్యం గుప్తా ఇంటికి అర్ధరాత్రి వేళకు గానీ చేరుకునేవాడుకాదు. ఎన్నో సార్లు భర్తకు చెప్పే ప్రయత్నం చేసినా గుప్తా తన తీరును మార్చుకోలేదు. ఈ విషయమై భార్యభర్తల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. ఎప్పటిలాగే శనివారం (జనవరి 28) రాత్రి కూడా గుప్తా ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. ఈ క్రమంలో దంపతుల మధ్య మాటామాటా పెరిగి వాగ్వాధానికి దారితీసింది. కోపంతో రగిలిపోయిన పూనమ్‌ వాష్‌రూంలోని యాసిడ్‌ తీసుకొచ్చి గుప్తా ముఖంపై పోసింది.

ముఖమంతా తీవ్ర గాయలపాలైన గుప్తాను ఇరుగుపొరుగు సమీపంలోని ఉర్సలా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కలెక్టర్‌ గనీ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన పోలీసులు పూనమ్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. మద్యానికి బానిసైన గుప్తా తరచూ తాగి భార్యతో గొడవపడేవాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.