UP Covid News: యూపీలో నామమాత్రంగా కోవిడ్ ప్రభావం.. 33 జిల్లాల్లో కేసుల సంఖ్య నిల్.. కారణం ఇదేనా?

యూపీలో గత 24 గంటల్లో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదుకాలేదు.. కేవలం 11 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి.. ఇది ఫేక్ న్యూస్ కాదు నిజం.

UP Covid News: యూపీలో నామమాత్రంగా కోవిడ్ ప్రభావం.. 33 జిల్లాల్లో కేసుల సంఖ్య నిల్.. కారణం ఇదేనా?
Uttar Pradesh: No Covid-19 Active Case In 33 Districts
Follow us
Janardhan Veluru

|

Updated on: Sep 10, 2021 | 9:56 PM

UP Covid News: ఉత్తరప్రదేశ్(UP)లో కరోనా మహమ్మారి ప్రభావం నామమాత్రంగా మారుతోంది. 20 కోట్లకు పైగా జనాభా కలిగిన ఆ రాష్ట్రంలో గత 24 గంటల్లో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదుకాలేదు.. కేవలం 11 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన ప్రకటన మేరకు యూపీలోని కేవలం 199 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. సీఎం యోగి ఆధిత్యనాథ్ పాలనలోని రాష్ట్రంలోని మొత్తం 75 జిల్లాల్లో 33 జిల్లాల్లో ఒక్కటంటే ఒక్క కోవిడ్ యాక్టివ్ కేసు కూడా లేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గత 24 గంటల్లో 67 జిల్లాల్లో ఒక్క కొత్త కోవిడ్ కేసు కూడా నమోదుకాలేదని తెలిపింది. ఆ రాష్ట్రంలో కోవిడ్ పాజిటివిటీ రేటు 0.01 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 98.7 శాతంగా ఉన్నట్లు యూపీ ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 2.26 లక్షల శ్యాంపుల్స్ టెస్ట్ చేసినట్లు తెలిపింది.

యూపీలో కోవిడ్ ప్రభావం నామమాత్రంగా మారడం పట్ల యోగి ఆదిత్యనాథ్ సర్కారు హర్షం వ్యక్తంచేస్తోంది. రాష్ట్రంలో జోరుగా సాగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్ దీనికి కారణంగా అధికారులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో దాదాపు 7 కోట్ల మంది కనీసం ఒక డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. శుక్రవారంనాడు (సెప్టెంబర్ 10న) అమెరికా కంటే ఎక్కువ సంఖ్యలో యూపీలో వ్యాక్సిన్లు ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది. అమెరికాలో 8.07 లక్షల డోసుల వ్యాక్సిన్లు ఇవ్వగా.. యూపీలో 11.73 లక్షల కోవిడ్ వ్యాక్సిన్లు ఇచ్చినట్లు వెల్లడించింది.

దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్..

దేశంలో ఈ ఏడాది జనవరి మాసంలో దేశ వ్యాప్త కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టగా.. ఇప్పటి వరకు (సెప్టెంబర్ 10వ తేదీ సాయంత్రం 7 గం.ల వరకు) 73 కోట్ల (72,97,50,724) కోవిడ్ వ్యాక్సిన్లు ఇచ్చారు. శుక్రవారం ఒక్క రోజే సాయంత్రం 7 గం.ల వరకు దేశ వ్యాప్తంగా 57 లక్షల (56,91,552) డోసుల వ్యాక్సిన్లు ఇచ్చారు.

Also Read..

Pregnency: గర్భధారణ ఇప్పుడు వద్దు.. నవ దంపతులకు ఆ దేశం ప్రత్యేక వినతి

ఏపీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. ఆ మూడు జిల్లాల్లో 200క పైగా పాజిటివ్ కేసులు