యూపీ పోలీసుల కిరాతకం.. ఇద్దరు మహిళలపై విచక్షణారహితంగా దాడి.. కర్రలు, పైపులతో..

ఉత్తరప్రదేశ్‌ పోలీసులు యమకింకరుల్లా తయారయ్యారు. అంబేద్కర్‌నగర్‌ జిల్లా జలాల్‌పూర్‌లో ఇద్దరు మహిళలను పోలీసులు చితకబాదారు. అంబేద్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ ఆ మహిళలు గత కొద్దిరోజులుగా నిరసనలు చేస్తున్నారు

యూపీ పోలీసుల కిరాతకం.. ఇద్దరు మహిళలపై విచక్షణారహితంగా దాడి.. కర్రలు, పైపులతో..
Uttar Pradesh Cops

Updated on: Nov 07, 2022 | 5:59 PM

ఉత్తరప్రదేశ్‌ పోలీసులు యమకింకరుల్లా తయారయ్యారు. అంబేద్కర్‌నగర్‌ జిల్లా జలాల్‌పూర్‌లో ఇద్దరు మహిళలను పోలీసులు చితకబాదారు. అంబేద్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ ఆ మహిళలు గత కొద్దిరోజులుగా నిరసనలు చేస్తున్నారు. అయితే నిరసనల పేరుతో.. తమపై వాళ్లు రాళ్లతో దాడి చేశారని యూపీ (Uttar Pradesh) పోలీసులు ఆరోపించారు. పరిస్థితి అదుపు తప్పడంతో వాళ్లిద్దరిని అరెస్ట్‌ చేసినట్టు వెల్లడించారు. అరెస్ట్‌ చేసే ప్రయత్నంలో తోపులాట జరిగిందని పేర్కొన్నారు. ఈ తోపులాటలో వాళ్లిద్దరు కిందపడినట్టు తెలిపారు. ముందుగా మహిళలు తమపై, వాహనాలపై రాళ్లు రువ్వారని.. దీంతో చిన్న బలాన్ని ప్రయోగించామంటూ యూపీ పోలీసులు పేర్కొన్నారు.

అయితే.. ఉత్తరప్రదేశ్ పోలీసులు మహిళలపై లాఠీల వర్షం కురిపిస్తున్న వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ వీడియోలో పోలీసులు మహిళలపై కర్రలు, పైపులతో దాడి చేస్తున్నట్లు కనిపిస్తుంది. యూపీ పోలీసుల తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మహిళలతో ఇలాగేనా ప్రవర్తించేది అంటూ విమర్శిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్ జిల్లా జలాల్‌పూర్‌లో ఇటీవల బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. అయితే ఆ ప్రాంతం తమదంటూ కొందరు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీనిపై గతకొన్నిరోజులుగా వివాదం కొనసాగుతోంది. బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడం పట్ల కొందరు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

వీడియో చూడండి..

ఈ క్రమంలో ఆదివారం పోలీసులు అక్కడికి చేరుకున్న సందర్భంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆందోళన సమయంలో కొంతమంది నిరసనకారులు పోలీసు కారుపై దాడి చేసి ధ్వంసం చేశారని.. మహిళా సిబ్బందిని కొట్టినట్లు అంబేద్కర్ నగర్ పోలీసు అధికారి అజిత్ కుమార్ సిన్హా చెప్పారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..