Yogi Adityanath: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మధురలో మద్యం, మాంసం అమ్మకాలను పూర్తిగా నిషేధించారు. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేశారు. ఈ నిషేధాన్ని పక్కాగా అమలు చేయాలంటూ అధికారులకు తేల్చి చెప్పారు. నిషేధానికి సంబంధించిన ప్రణాళికలు రూపొందించాలని, మద్యం, మాంసం అమ్మకాలకు సంబంధించిన వ్యాపారులతో చర్చలు జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సోమవారం నాడు లక్నోలో జరిగిన కృష్ణోత్సవ్ 2021 కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. సందర్భంగా ప్రసంగించిన ఆయన.. మద్యం, మాంసం వ్యాపారం చేసే వారు.. తమ వ్యాపారాన్ని మార్చుకోవాలని అన్నారు. పాల ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచిన మధుర పూర్వ వైభవాన్ని పునరుద్ధరించడానికి.. వారంతా పాలు విక్రయించాలని సీఎం సూచించారు. ఇదే సమయంలో కరోనా మహమ్మారిని అంతమొందించాలంటూ శ్రీకృష్ణుడిని ఆయన ప్రార్థించారు.
‘‘దైవ భూమి అభివృద్ధి కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి నిధుల కొరత ఏమాత్రం రానీయం. మధుర అభివృద్ధి కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.’’ అని సీఎం ఆదిత్యనాథ్ చెప్పుకొచ్చారు. చాలా కాలంగా నిర్లక్ష్యం చేయబడిన విశ్వాస స్థలాలు ఇప్పుడు పునరుద్ధరించబడుతున్నాయని సీఎం పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి కొత్త దిశానిర్దేశం చేశారని అభినందించారు. కాగా, ఈ కార్యక్రమంలో కేబినెట్ మంత్రులు లక్ష్మీ నారాయణ్ చౌదరి, శ్రీకాంత్ శర్మ కూడా పాల్గొన్నారు.
Also read:
Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్.. దిగి వచ్చిన గోల్డ్ రేటు.. తాజా ధరల వివరాలు
Rains Alerts: తెలంగాణలో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం.. వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు
AP-TS Weather Alert: అల్పపీడనం ప్రభావం.. ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఛాన్స్..