AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వివాహ వేదికపై రచ్చ రచ్చ.. పెళ్లి కొడుకు మరీ సన్నగా ఉన్నాడని రిజెక్ట్ చేసిన వధువు.. చివరకు..!

ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యా జిల్లాలో పెళ్లి వేడుకల్లో జరిగిన ఒక విచిత్రమైన వివాదం చివరకు పెళ్లి రద్దుకు దారితీసింది. పూలమాలలు మార్చుకునే సమయంలో వధూవరుల మధ్య మొదలైన చిన్న గొడవ, కాబోయే భర్త శారీరక ఆకృతిపై వధువు చేసిన కామెంట్లతో పెళ్లి పీటల మీదే ఆగిపోయింది. చివరకు ఇటావా నుండి వచ్చిన పెళ్లి ఊరేగింపు బారాత్ వధువు లేకుండానే ఖాళీ చేతులతో వెనుదిరిగింది.

వివాహ వేదికపై రచ్చ రచ్చ.. పెళ్లి కొడుకు మరీ సన్నగా ఉన్నాడని రిజెక్ట్ చేసిన వధువు.. చివరకు..!
Bride Refuses Groom At Jaimala
Balaraju Goud
|

Updated on: Jun 27, 2026 | 5:00 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యా జిల్లాలో పెళ్లి వేడుకల్లో జరిగిన ఒక విచిత్రమైన వివాదం చివరకు పెళ్లి రద్దుకు దారితీసింది. పూలమాలలు మార్చుకునే సమయంలో వధూవరుల మధ్య మొదలైన చిన్న గొడవ, కాబోయే భర్త శారీరక ఆకృతిపై వధువు చేసిన కామెంట్లతో పెళ్లి పీటల మీదే ఆగిపోయింది. చివరకు ఇటావా నుండి వచ్చిన పెళ్లి ఊరేగింపు బారాత్ వధువు లేకుండానే ఖాళీ చేతులతో వెనుదిరిగింది.

అచ్చల్దా పోలీస్ స్టేషన్ పరిధిలోని దివారియా గ్రామంలో శుక్రవారం (జూన్ 26) రాత్రి ఈ సంఘటన జరిగింది. రాత్రి 10 గంటల ప్రాంతంలో బాజాభజంత్రీలు, బంధువుల కోలాహలం మధ్య వధూవరులు పూలమాలలు మార్చుకోవడానికి వేదికపైకి వచ్చారు. ఆ సమయంలో ఏదో చిన్న విషయమై పెళ్లికూతురి సోదరుడికి, పెళ్లికొడుకుకు మధ్య వాగ్వాదం మొదలైంది. అది కాస్తా పెద్దదై ఇరువర్గాల మధ్య తోపులాటకు దారితీసింది. ఈ గందరగోళం మధ్య పెళ్లికూతురు అందరి ముందూ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.

తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, పెళ్లికొడుకు మరీ సన్నగా ఉన్నాడని, అతడిని తాను భర్తగా అంగీకరించనని బహిరంగంగా ప్రకటించింది. వధువు మాటలకు అక్కడున్న వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. వరుడి తరఫు వారు, పెద్దలు ఎంత నచ్చజెప్పినా వధువు తన పట్టు వదల్లేదు. వివాదం ముదరడంతో ఎవరో యూపీ డయల్ 112కు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. అనంతరం గ్రామ పెద్దల సమక్షంలో అర్ధరాత్రి పంచాయితీ నిర్వహించారు. దాదాపు మూడు గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిగినా వధువు మనసు మార్చుకోలేదు.

చివరికి ఎలాంటి పరిష్కారం లభించకపోవడంతో, తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో వరుడి కుటుంబం పెళ్లి తంతు పూర్తికాకుండానే ఇటావాకు తిరుగుపయనమైంది. గంటల వ్యవధిలోనే పెళ్లి పందిరి కాస్తా నిశ్శబ్దంగా మారిపోయింది. ఈ వింత ఘటన ప్రస్తుతం ఆ ప్రాంతమంతటా హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఈ గొడవ కేవలం పూలమాలల సమయంలో జరిగింది కాదని, వధువుకు ఈ సంబంధం మొదటి నుండి ఇష్టం లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉంటుందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటివరకు ఇరుపక్షాల నుంచి పోలీసులకు ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదు అందలేదు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!