Occultist Crime: దెయ్యాన్ని వదిలిస్తానని మహిళ గొంతుపై కాలుతో తొక్కి.. ప్లాస్టిక్‌ పైప్‌తో చావగొట్టి..! చివరికి ఏం జరిగిందంటే

|

Oct 25, 2023 | 3:12 PM

పత్వారియా ప్రాంతానికి చెందిన ప్రియా సక్సేనా (40)కు ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. భర్తతో గొడవల కారణంగా గత కొంతకాలంగా వేరుగా జీవిస్తోంది. కొన్నిరోజుల క్రితం ప్రియా సక్సేనా అనారోగ్యానికి గురైంది. మానసిక సమస్యలతో అల్లాడుతోన్న ఆమెను పుట్టింటి వారు ఓ క్షుద్రపూజలు చేసే వ్యక్తి వద్దకు తీసుకెళ్లారు. అయితే ఆ తాంత్రికుడు ప్రియకు దెయ్యం పట్టిందని, ఆ దెయ్యాన్ని వదిలిస్తానని నమ్మబలికాడు. ఈ క్రమంలో శనివారం (అక్టోబర్‌ 21) ప్రియ పుట్టింట్లో..

Occultist Crime: దెయ్యాన్ని వదిలిస్తానని మహిళ గొంతుపై కాలుతో తొక్కి.. ప్లాస్టిక్‌ పైప్‌తో చావగొట్టి..! చివరికి ఏం జరిగిందంటే
Occultist Crime in UP
Follow us on

కాన్పూర్‌, అక్టోబర్ 25: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. దెయ్యం వదలకొడతానని నమ్మబలికిన ఓ తాంత్రికుడు చిత్రహింసలకు మహిళ బలైంది. దెయ్యం వదిలిస్తానని చెప్పి మహిళ మెడపై కాలేసి తొక్కడం, నీటిపైపుతో బలంగా కొట్టడంతో మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లా కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని పత్వారియా ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

పత్వారియా ప్రాంతానికి చెందిన ప్రియా సక్సేనా (40)కు ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. భర్తతో గొడవల కారణంగా గత కొంతకాలంగా వేరుగా జీవిస్తోంది. కొన్నిరోజుల క్రితం ప్రియా సక్సేనా అనారోగ్యానికి గురైంది. మానసిక సమస్యలతో అల్లాడుతోన్న ఆమెను పుట్టింటి వారు ఓ క్షుద్రపూజలు చేసే వ్యక్తి వద్దకు తీసుకెళ్లారు. అయితే ఆ తాంత్రికుడు ప్రియకు దెయ్యం పట్టిందని, ఆ దెయ్యాన్ని వదిలిస్తానని నమ్మబలికాడు. ఈ క్రమంలో శనివారం (అక్టోబర్‌ 21) ప్రియ పుట్టింట్లో హోమం కూడా నిర్వహించాడు. హోమం అనంతరం భూతవైద్యం పేరుతో ప్రియను చిత్రహింసలకు గురిచేశాడు. తాంత్రిక పూజలో భాగంగా ఆమె మెడపై కాలు వేసి తాంత్రికుడు తొక్కాడు. అనంతరం నీటి పైపుతో ఆమెను దారుణంగా కొట్టాడు. దీంతో ప్రియ మరణించింది. ఆమె మృతి చెందిన తర్వాత కూడా తాంత్రికుడు ఆమె అపస్మారక స్థితిలో ఉందని, ఏడు రోజుల్లో ఆమె అనారోగ్య సమస్యలన్నీ నయమవుతాయని తాంత్రికుడు చెప్పాడు. దీంతో వారు మరణించిన ప్రియను ఇంటికి తీసుకెళ్లారు.

ఆమె స్పృహలోకి వస్తుందని ఆదివారం ఉదయం వరకు వేచిచూశారు. 24 గంటలు గడిచినా ప్రియకు స్పృహ రాకపోవడంతో కుటుంబసభ్యులు తాంత్రికుడిని పిలిచారు. ప్రియ ఇంటికి వచ్చిన తాంత్రికుడు కాసేపట్లో ఆమెకు స్పృహ వస్తుందని చెప్పి వెళ్లిపోయాడు. ఆదివారం సాయంత్రం వరకు ప్రియకు స్పృహ రాకపోవడంతో ప్రియ చనిపోయినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న జిల్లా ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తాంత్రికుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారని ఎస్పీ (నగరం) కపిల్ దేవ్ సింగ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.