Donald Trump 2.0: ట్రంప్ పునరాగమనం భారత్‌కు లాభమా.. నష్టమా?

డొనాల్డ్ ట్రంప్‌ - నరేంద్ర మోదీ మధ్య మంచి స్నేహ బంధం ఉండడం, గత ఎన్నికల సమయంలో ట్రంప్ కోసం మోదీ ప్రచారం కూడా చేయడంతో.. దేశంలోని మోదీ అభిమానులు ట్రంప్‌ అనుకూల వైఖరిని వ్యక్తం చేస్తున్నారు. కానీ ట్రంప్ గతంలో అనుసరించిన విధానాలు, ఇప్పుడు ప్రకటిస్తున్న విధానాలు ఏవీ కూడా భారతదేశానికి అంత అనుకూలం కాదని స్పష్టమవుతోంది.

Donald Trump 2.0: ట్రంప్ పునరాగమనం భారత్‌కు లాభమా.. నష్టమా?
PM Modi, Donald Trump

Edited By:

Updated on: Jul 16, 2024 | 10:26 AM

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం, అగ్రరాజ్యంగా పేరొందిన అమెరికాలో త్వరలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. పెన్సిల్వేనియాలో ఓ ఎన్నికల ప్రచార సభలో మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం తర్వాత ఆయన గెలుపు సునాయాసమే అన్న ప్రచారం ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. నిజానికి గత ఎన్నికల్లోనే గట్టి పోటీ ఇచ్చి, తృటిలో పరాజయం పాలైన ట్రంప్.. ఈ హత్యాయత్నం ఘటనతో సంబంధం లేకుండానే గెలుస్తారన్న ప్రచారం సాగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్‌లోనూ ట్రంప్‌పై దాడి ఘటన గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఐటీ ఎగుమతుల నుంచి, టెక్నాలజీ రంగ నిపుణుల వలసల వరకు ఆ దేశంపై ఆధారపడుతున్న భారతదేశానికి.. ట్రంప్ ఆగమనం లాభమా.. నష్టమా అన్నదే ఇప్పుడు భారతీయులందరి ముందు ఉన్న ప్రశ్న. ఇదే సమయంలో ఆయన తన పార్టీ నుంచి ఉపాధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు వాన్స్‌ను బరిలోకి దింపడం మరింత ఆసక్తికరంగా మారింది. డొనాల్డ్ ట్రంప్‌ – నరేంద్ర మోదీ మధ్య మంచి స్నేహ బంధం ఉండడం, గత ఎన్నికల సమయంలో ట్రంప్ కోసం మోదీ ప్రచారం కూడా చేయడంతో.. దేశంలోని మోదీ అభిమానులు ట్రంప్‌ అనుకూల వైఖరిని వ్యక్తం చేస్తున్నారు. కానీ ట్రంప్ గతంలో అనుసరించిన విధానాలు, ఇప్పుడు ప్రకటిస్తున్న విధానాలు ఏవీ కూడా భారతదేశానికి అంత అనుకూలం కాదని స్పష్టమవుతోంది. ట్రంప్ మళ్లీ అమెరికా అధ్యక్షుడు కావొచ్చన్న అంచనాలతో భారత్ తమ విదేశీ దౌత్య వ్యూహాలపై...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి