AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alok Pandey on Twitter: తాతా నీకు వందనం.. నచ్చిన జాబ్ లేదంటూ ఖాళీగా కూర్చునే నేటి యువతకు ఆదర్శం నీ జీవితం

కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అని శ్రీ శ్రీ ఎప్పుడో చెప్పారు.. ఆ మాటను నిజం చేస్తూ చాలామంది యువత తమ చదువు తగ్గ ఉద్యోగం రాలేదనో.. పని నచ్చలేదు ఇలా అనేక కారణాలను...

Alok Pandey on Twitter: తాతా నీకు వందనం.. నచ్చిన జాబ్ లేదంటూ ఖాళీగా కూర్చునే నేటి యువతకు ఆదర్శం నీ జీవితం
Follow us
Surya Kala

|

Updated on: Mar 08, 2021 | 7:06 PM

Viral Video : కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అని శ్రీ శ్రీ ఎప్పుడో చెప్పారు.. ఆ మాటను నిజం చేస్తూ చాలామంది యువత తమ చదువు తగ్గ ఉద్యోగం రాలేదనో.. పని నచ్చలేదు ఇలా అనేక కారణాలను చూపిస్తూ.. ఖాళీగా కూర్చుని ఉంటారు. కష్టపడి పనిచేసుకునే వయసు ఒంట్లో ఓపిక ఉన్నా కూడా తల్లిదండ్రులపై ఆధారపడి బతుకుతుంటారు. ఇక కొంత మంది శరీరంలో అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నప్పటికీ పనిచేసేందుకు బద్దకిస్తారు.. చేయి చాచి బిక్షమెత్తుకుని బతకడానికి కూడా సిగ్గుపడరు.. అలాంటివారికి ఈ 98 ఏళ్ల వృద్ధుడు ఆదర్శం.. ఇంకా చెప్పాలంటే ఆలాంటి వారు ఈ 98ఏళ్ల వృద్దున్నీ చూసి నిజంగా సిగ్గు తెచ్చుకోవాలి… ఎందుకంటే 98ఏళ్ల వయసులో కృష్ణా, రామా అనుకుంటూ ఓ మూలన కూర్చొని.. పెట్టింది తిని ఉండకుండా.. చేతనైన పని చేసుకుంటూ.. కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాడు. ఈ వయసులో నీకు ఈ పని అవసరమా తాతా అని అడిగితే ఇంట్లో ఖాళీగా ఉండలేనని చెబుతున్నాడు. ఈ తాత చేస్తున్న పనికి జిల్లా మెజిస్ట్రేట్‌ అయనకి సన్మానం చేశారు. మరి ఆ తాత ఎవరో ఎక్కడో తెలుసుకుందాం..

ఉత్తరప్రదేశ్‌ రాయ్‌బరేలికి చెందిన విజయ్‌ పాల్‌ సింగ్‌ వయసు 98 ఏళ్లు. ఇప్పటికీ ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడు. తన పనులన్ని తానే చేసుకుంటున్నాడు. ఒంట్లో కాస్తా శక్తి ఉండడంతో ఖాళీగా ఉండలేక.. తన ఇంటి సమీపంలో రోడు పక్కన ఓ తోపుడు బండి పెట్టుకున్నాడు. దాని మీద ఉడికించిన శనగలు.. మొలకలు పెట్టుకుని అమ్ముతుంటాడు. నిజానికి ఆయన ఈ వయసులో ఇలా పని చేయడం ఆయన కుటుంబంలో ఎవరికీ కూడా ఇష్టం లేదు.. అయితే ఖాళీగా కూర్చోవడం తనకు నచ్చదని.. అందుకే పని చేస్తునట్టుగా చెప్పుకొస్తున్నాడు ఈ తాత..

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో జిల్లా మేజిస్ట్రేట్ వైభవ్‌ శ్రీవాస్తవ.. విజయ్‌ పాల్‌ సింగ్‌ని తన కార్యాలయానికి ఆహ్వానించి రూ. 11,000 నగదును అందజేశారు. అంతేకాకుండా శాలువా కప్పి సన్మానం కూడా చేశారు.. వీటితో పాటుగా వాకింగ్ స్టిక్, సర్టిఫికేట్‌ అందజేశారు. ప్రభుత్వ పథకం కింద వృద్ధుడికి ఇల్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. అయినా సరే తాను ఖాళీగా ఉండనని.. ఓపిక ఉన్నంతవరకూ ఏదొక పనిచేస్తూ ఉంటానని చెబుతున్నారు ఈ తాత..

Also Read:

చరిత్ర పుటల్లో లేని.. పోర్చుగీసువారిని వణికించిన గొప్ప వీరనారి… ఈ రాణి గురించి ఎంత మందికి తెలుసు?

 వన్డే చరిత్రలో అదో అద్భుతం.. సిక్సర్ల వర్షం.. ప్రపంచకప్‌లో అత్యధిక స్కోర్..!