AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రికి ఉద్వాసన పలుకుతారా ? ఢిల్లీలో మకాం పెట్టిన రావత్

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ కి ఉద్వాసన  పలకవచ్చునని తెలుస్తోంది. ఈ ఊహాగానాల మధ్య ఆయన హుటాహుటిన ఢిల్లీ చేరుకున్నారు. రావత్ సొంత పార్టీ ఎమ్మెల్యేలే.....

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రికి ఉద్వాసన పలుకుతారా ? ఢిల్లీలో మకాం పెట్టిన రావత్
Umakanth Rao
| Edited By: |

Updated on: Mar 08, 2021 | 6:03 PM

Share

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ కి ఉద్వాసన  పలకవచ్చునని తెలుస్తోంది. ఈ ఊహాగానాల మధ్య ఆయన హుటాహుటిన ఢిల్లీ చేరుకున్నారు. రావత్ సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఈయన పాలన ‘బిలో ఏవరేజ్’ (మరీ పేలవంగా) ఉందని పెదవి విరుస్తున్న వేళ ఈయన తొలగింపు తప్పకపోవచ్చునని అంటున్నారు. పార్టీకి చెందిన ఇద్దరు కేంద్ర పరిశీలకులు ..రమణ్ సింగ్, దుశ్యంత్ గౌతమ్ ఈ నెల 6 న డెహ్రాడూన్ వెళ్లి అక్కడి పొలిటికల్ పరిస్థితిని సమీక్షించడంతోనూ, వచ్ఛే ఏడాది ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతోను  రావత్ తొలగింపు అనివార్యమేమోనని తెలుస్తోంది. ఈయన స్థానే కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిషాంక్, లేదా సత్పాల్ మహారాజ్ లను ఉత్తరాఖండ్ సీఎం గా నియమిస్తారేమో అన్న వార్తలు వస్తున్నాయి. అయితే రావత్  తొలగింపు ఊహాగానాలను ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వంశీధర్ భగత్ తోసిపుచ్చారు. అలాంటి యోచనేదీ పార్టీకి లేదని ఆయన చెప్పారు.

కాగా- ప్రభుత్వ పాలనకు సంబంధించి త్రివేంద్ర సింగ్ రావత్ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని, తమను విశ్వాసం లోకి తీసుకోవడంలేదని పలువురు రాష్ట్ర మంత్రులు ఆరోపిస్తున్నారు. రావత్ పై అవినీతి ఆరోపణలు లేకపోయినప్పటికీ ఆయన బలహీన ముఖ్యమంత్రి అని ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలే అంటున్నారు. గతంలో కూడా బీజేపీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులను తొలగించినప్పటికీ అది పార్టీకి ప్రయోజనం కలిగించలేదు.అటు కాంగ్రెస్ పార్టీకి కూడా ఇది లాభించలేదు. ఎన్నికలు జరిగే ముందు ఒక సీఎం ను పార్టీ తొలగించిందంటే.. ప్రభుత్వ పాలన చాలా పూర్ గా ఉందని ఒప్పుకున్నట్టే అవుతుందని, పైగా అది విపక్షాలకు మంచి అవకాశం ఇఛ్చినట్టవుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో.. త్రివేంద్ర సింగ్ రావత్ ను కొనసాగిస్తారా లేక తొలగిస్తారా అన్నది తేలాల్సి ఉంది.

మరిన్ని చదవండి ఇక్కడ :

స్పర్మ్ డొనేట్ చేస్తే లక్షల్లో డబ్బులు..డబ్బులు లేక చేసిన పని లక్షల్లో ఆదాయం చూపింది : Sperm Donor Video.

నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తోన్న తెలుగు తేజం పి .వి సింధు.

Follow Us
రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పని చేయండి.. మీరు ఊహించని విధంగా..
రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పని చేయండి.. మీరు ఊహించని విధంగా..
అగ్రరాజ్యం టెక్ సామ్రాజ్యంపై ఇరాన్ పంజా! కంపెనీలకు డెత్ వారెంట్..
అగ్రరాజ్యం టెక్ సామ్రాజ్యంపై ఇరాన్ పంజా! కంపెనీలకు డెత్ వారెంట్..
మెట్రోలో సిగరేట్ తాగితే ఎలాంటి శిక్ష వేస్తారో తెలుసా..?
మెట్రోలో సిగరేట్ తాగితే ఎలాంటి శిక్ష వేస్తారో తెలుసా..?
తొలుత మాత్రే.. చివర్లో దుబే, సర్ఫరాజ్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
తొలుత మాత్రే.. చివర్లో దుబే, సర్ఫరాజ్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
రాకాస రివ్యూ.. నిహారిక ఖాతాలో మరో హిట్ ప‌డిందా
రాకాస రివ్యూ.. నిహారిక ఖాతాలో మరో హిట్ ప‌డిందా
రేసింగ్ + ఎమోషన్‌.. శర్వా ఈసారి కూడా గట్టెక్కేశాడు
రేసింగ్ + ఎమోషన్‌.. శర్వా ఈసారి కూడా గట్టెక్కేశాడు
సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా.. ఇవి చెక్ చేయకపోతే..
సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా.. ఇవి చెక్ చేయకపోతే..
టోల్ గేట్ల వద్ద క్యాష్ పేమెంట్స్ బంద్.. ఎప్పటినుంచంటే..?
టోల్ గేట్ల వద్ద క్యాష్ పేమెంట్స్ బంద్.. ఎప్పటినుంచంటే..?
చనిపోయినప్పుడు సౌందర్య బాడీకి తల లేదు.. అలా చూసి తట్టుకోలేకపోయాను
చనిపోయినప్పుడు సౌందర్య బాడీకి తల లేదు.. అలా చూసి తట్టుకోలేకపోయాను
ఏరికోరి తెచ్చుకుంటే.. చెన్నైకి తలనొప్పిలా తయారైన శాంసన్
ఏరికోరి తెచ్చుకుంటే.. చెన్నైకి తలనొప్పిలా తయారైన శాంసన్