UP Elections 2022: ఎన్నికల వేళ నేతల కప్పదాట్లు షురూ.. SPలో చేరనున్న కాంగ్రెస్ నేత

ఉత్తర ప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కప్పదాట్లు జోరందుకున్నాయి.

UP Elections 2022: ఎన్నికల వేళ నేతల కప్పదాట్లు షురూ.. SPలో చేరనున్న కాంగ్రెస్ నేత
Assembly Elections 2022

ఉత్తర ప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కప్పదాట్లు జోరందుకున్నాయి. రాత్రికి రాత్రే జంప్ జిలానీలు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారిపోతున్నారు. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లోనూ (ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్‌) ఇదే పరిస్థితి నెలకొంటోంది. యూపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత ఇమ్రాన్ మసూద్ ఆ పార్టీని వీడి సమాజ్‌వాది పార్టీలో చేరేందుకు సన్నద్ధమయ్యారు. సమాజ్‌వాది పార్టీలో చేరనున్నట్లు మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గమనిస్తే.. బీజేపీ – ఎస్పీ మధ్యే ప్రధాన పోటీ ఉన్నట్లు తేటతెల్లం అవుతోందన్నారు. అందుకే తాను, తన మద్ధతుదారులు అఖిలేష్ కుమార్ యాదవ్‌కు అండగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. యువకులు, రైతులు, మహిళల కోసం పనిచేసే ప్రభుత్వం యూపీలో రావాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు.

అటు గోవాలో అధికార బీజేపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఏడు గంటల వ్యవధిలో మంత్రి మైఖేల్ లోబో, ఎమ్మెల్యే ప్రవీణ్ జంట్యే తమ పదవులకు రాజీనామా చేశారు. మైఖేల్ లోబో మంత్రి, ఎమ్మెల్యే పదవులతో పాటు బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. లోబో రాజీనామాతో గోవా అసెంబ్లీలో బీజేపీ బలం 24కు పడిపోయింది. మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఉండి ఉంటే తాను బీజేపీకి రాజీనామా చేసేవాడిని కానని లోబో చెప్పుకొచ్చారు. లోబో బీజేపీలో 15 ఏళ్లుగా కొనసాగారు.. అటు 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రవీణ్ జంట్యే తన పదవికి, బీజేపీకి రాజీనామా చేశారు.

గోవాలో తృణాముల్ కాంగ్రెస్‌తో పొత్తుపై రాహుల్ గాంధీ చర్చలు జరిపినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ స్పష్టంచేశారు. ఈ వార్తలు పూర్తిగా నిరాధారమని, అవాస్తవమన్నారు. గోవాను త్వరలోనే కాంగ్రెస్ పార్టీ సరైన బాటలో పెడుతుందని ధీమా వ్యక్తంచేశారు.

Also Read..

N-95 Mask: పదే, పదే ఎన్​-95 మాస్కులు కొనాల్సిన పనిలేదు.. ఇలా క్లీన్ చేస్తే పాతికసార్లు వాడొచ్చు!

Ram Gopal Varma: కట్టప్ప ను ఎవరు చంపారంటూ.. మరోసారి ఏపీ ప్రభుత్వంపై ఆర్జీవి సంచలన ట్వీట్..

Click on your DTH Provider to Add TV9 Telugu