Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అర్ధరాత్రి గర్ల్‌ ఫ్రెండ్ బర్త్ డే వేడుకలకు రోడ్డుపైకి వచ్చిన జంట.. అంతలో ఊహించని సీన్! ఏం జరిగిందంటే..

ఎంతో హుషారుగా పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు వచ్చిన ఓ జంటకు ఊహించని ఉపద్రవం ముంచుకొచ్చింది. నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ నడుచుకుంటూ వెళ్తుండగా.. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదుగానీ ఓ కారు వేగంగా వారివైపు దూసుకువచ్చింది. ఆ తర్వాత..

అర్ధరాత్రి గర్ల్‌ ఫ్రెండ్ బర్త్ డే వేడుకలకు రోడ్డుపైకి వచ్చిన జంట.. అంతలో ఊహించని సీన్! ఏం జరిగిందంటే..
Midnight Birthday Celebrations
Srilakshmi C
|

Updated on: Jul 03, 2025 | 6:16 PM

Share

లక్నో, జులై 3: ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో మంగళవారం (జులై 1) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎంతో హుషారుగా పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు వచ్చిన ఓ జంటకు ఊహించని ఉపద్రవం ముంచుకొచ్చింది. వేగంగా వస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న తినుబండారల దుఖానాన్ని ఢీకొట్టడంతో ఈ దారుణం చోటు చేసుకుంది. దీంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి గార్ల్‌ ఫ్రెండ్ తీవ్రంగా గాయపడింది. ఆమెతోపాటు మరో ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడ్డారు. అసలేం జరిగిందంటే..

బులంద్‌షహర్ జిల్లాలోని ఫరాద్‌పూర్ గ్రామానికి చెందిన అజిత్‌పాల్, తన స్నేహితురాలు ఆకాంక్షను అర్ధరాత్రి సమయంలో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి హాపూర్‌లోని బాబుగఢ్ ప్రాంతంలోని ప్రసిద్ధ రాజా జీ ధాబాకు తీసుకువచ్చాడు. ఆ జంట రాత్రి భోజనం ముగించుకుని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ధాబా గేటు నుంచి కాలి నడకల వెళ్తుండగా.. రోడ్డుపై వేగంగా వస్తున్న కారు ఒకటి అదుపు తప్పి వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అజిత్‌పాల్ అక్కడికక్కడే మరణించాడు. అతడి గర్ల్‌ ఫ్రెండ్ ఆకాంక్ష, పక్కనే ఉన్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అజిత్‌పాల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించినట్లు అదనపు పోలీసు సూపరింటెండెంట్ వినీత్ భట్నాగర్ తెలిపారు. గాయపడిన వారిని హాపూర్‌లోని గర్ రోడ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని భట్నాగర్ చెప్పారు. దెబ్బతిన్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని, పరారైన డ్రైవర్ కోసం గాలింపు చర్యలు ప్రారంభించామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.