Jhansi Railway Station: ఆ రైల్వే స్టేషన్ పేరు మార్పు!.. కీలక ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం..

|

Aug 04, 2021 | 8:21 AM

Jhansi Railway Station: ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఝాన్సీ రైల్వే స్టేషన్ పేరును ‘‘వీరంగన లక్ష్మీబాయి రైల్వే స్టేషన్’’ గా మార్చాలని కేంద్రానికి..

Jhansi Railway Station: ఆ రైల్వే స్టేషన్ పేరు మార్పు!.. కీలక ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం..
Trains
Follow us on

Jhansi Railway Station: ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఝాన్సీ రైల్వే స్టేషన్ పేరును ‘‘వీరంగన లక్ష్మీబాయి రైల్వే స్టేషన్’’ గా మార్చాలని కేంద్రానికి ప్రతిపాదన పంపినట్లు మంగళవారం నాడు లోక్‌సభ వెల్లడించింది. ఝాన్సీ రైల్వే స్టేషన్ పేరును వీరంగన లక్ష్మీబాయి రైల్వే స్టేషన్‌గా మార్చాలనే యూపీ ప్రభుత్వ ప్రతిపాదనలు అందాయని, దీనికి సంబంధించి నిర్దేశించిన విధానాల ప్రకారం సంబంధిత శాఖ సూచనలు, అభిప్రాయలు తీసుకుంటున్నామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మంగళవారం నాడు లోక్‌సభలో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానం చెప్పారు.

రైల్వే మంత్రిత్వ శాఖ, పోస్టల్ డిపార్ట్‌మెంట్, సర్వే ఆఫ్ ఇండియా నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోతే స్టేషన్ పేరు మార్చేందుకు కేంద్రం అనుమతించనుంది. అంతేకాదు.. ప్రతిపాదిత పేరుకు సమానమైన పేరుతో తమ రికార్డులలో అలాంటి పట్టణం, గ్రామం లేదని ఈ శాఖలు నిర్ధారించాల్సి ఉందని, ఆ తరువాతే తదుపరి చర్యలు తీసుకుంటామని లోక్‌సభలో నిత్యానంద్ రాయ్ తెలిపారు. ఒక రాష్ట్రం పేరు మార్చాలంటే పార్లమెంట్‌లో సాధారణ మెజారిటీతో రాజ్యాంగ సవరణ అవసరమవుతుంది. ఇక గ్రామం, పట్టణం, రైల్వే స్టేషన్ పేరు మార్చడానికి ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్స్ అవసరం అవుతాయి.

Also read:

Charmme Kaur: సంచలన నిర్ణయం తీసుకున్న ఛార్మి.. విరామం కావాలంటూ..