UP Elections 2022: కాంగ్రెస్‌ బాటలోనే బీజేపీ.. ఐటీ దాడులపై అఖిలేష్ యాదవ్ ధ్వజం

Akhilesh Yadav: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ(సమాజ్‌వాది పార్టీ)కి చెందినవారిపై ఐటీ రైడ్స్‌ కలకలం రేపుతున్నాయి. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ప్రముఖ నేతలలతో పాటు ఆ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ సన్నిహితుల నివాసాల్లో..

UP Elections 2022: కాంగ్రెస్‌ బాటలోనే బీజేపీ.. ఐటీ దాడులపై అఖిలేష్ యాదవ్ ధ్వజం
Income Tax Department

Edited By: Anil kumar poka

Updated on: Dec 23, 2021 | 6:13 PM

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ(సమాజ్‌వాది పార్టీ)కి చెందినవారిపై ఐటీ రైడ్స్‌ కలకలం రేపుతున్నాయి. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ప్రముఖ నేతలలతో పాటు ఆ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ సన్నిహితుల నివాసాల్లో ఐటీ అధికారులు శనివారం తనిఖీలు చేశారు. ఎస్పీ నేతలు రాజీవ్ రాయ్, మనోజ్ యాదవ్, అఖిలేష్ పర్సనల్ సెక్రటరీ జైనేంద్ర యాదవ్ తదితర ఇళ్లలో ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. యూపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమ పార్టీ నేతలు, అఖిలేష్ యాదవ్ సన్నిహితుడి ఇళ్లలో జరిగిన ఐటీ దాడులపై అఖిలేష్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. తమ పార్టీ నేతలపై ఐటీ దాడులు రాజకీయ ప్రేరేపితమని ఆయన ఆరోపించారు. బీజేపీయే ఈ ఐటీ దాడులు చేయించిందని ఆరోపించారు.

రాజకీయ ప్రయోజనాల కోసం ఐటీ శాఖ, కేంద్ర దర్యాప్త సంస్థలను పావుగా వాడుకోవడంలో కాంగ్రెస్ బాటలోనే బీజేపీ వెళ్తోందని ఆరోపించారు. ఇప్పుడు ఐటీ దాడులు.. ఎన్నికలు సమీపిస్తున్నందున ముందు ముందు సీబీఐ, ఈడీ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా రంగంలోకి దిగే అవకాశముందని విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థులను బెదిరించేందుకు గతంలో కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వ్యూహాన్నే ఎంచుకునేదని పేర్కొన్నారు. అయితే ఇలాంటి దాడులతో సైకిల్ (సమాజ్‌వాది పార్టీ ఎన్నికల చిహ్నం) ముందుకు నడపకుండా అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు.

వచ్చే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకపోవడం ఖాయమని అఖిలేష్ జోస్యం చెప్పారు. మరోసారి రాష్ట్ర ప్రజలను మోసగించలేరని అన్నారు.

Also Read..

Blast in Hyderabad: హైదరాబాద్‌లో భారీ పేలుడు.. కెమికల్ డబ్బాను కట్ చేస్తుండగా..

Bigg Boss Telugu 5: బిగ్‌బాస్‌ హౌస్‌లో సిరి, షణ్నులది లవ్‌ సిరీస్‌ను తలపిస్తోందా..?