‘వాళ్ళు రాళ్లు విసురుతున్నారు… అందుకే మమ్మల్ని మేం రక్షించుకోవడానికి …..ఇదిగో మేమిలా ‘! యూపీ పోలీసుల ‘రక్షణ కవచాలు ‘చూడాల్సిందే . !

యూపీలోని ఉన్నవ్ జిల్లా పోలీసుల తీరు చూస్తే అదో కామిక్ సీనులా..తమాషాగా కనిపిస్తుంది. స్థానికులు తమపై రాళ్లు విసురుతుంటే తమను తాము రక్షించుకోవడానికి వారు భలే విచిత్రమైన వస్తువులను ఎంచుకున్నారు.

'వాళ్ళు రాళ్లు విసురుతున్నారు... అందుకే  మమ్మల్ని మేం రక్షించుకోవడానికి .....ఇదిగో మేమిలా '! యూపీ పోలీసుల 'రక్షణ కవచాలు 'చూడాల్సిందే . !
Up Cop Uses Plastic Stool A
Follow us

| Edited By: Phani CH

Updated on: Jun 17, 2021 | 6:58 PM

యూపీలోని ఉన్నవ్ జిల్లా పోలీసుల తీరు చూస్తే అదో కామిక్ సీనులా..తమాషాగా కనిపిస్తుంది. స్థానికులు తమపై రాళ్లు విసురుతుంటే తమను తాము రక్షించుకోవడానికి వారు భలే విచిత్రమైన వస్తువులను ఎంచుకున్నారు. అసలు విషయానికి వస్తే.. ఈ జిల్లాలోని అక్రమ్ పూర్ లో నిన్న ఇద్దరు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మరణించారు.అయితే ఇందుకు బాధ్యురాలైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు ఆందోళన మొదలు పెట్టారు. ఇద్దరు వ్యక్తుల మృతదేహాలతో రాస్తా రోకో చేశారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. వారిని చూడగానే మహిళలతో సహా స్థానికులంతా వారిపై రాళ్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు.

కొందరు ఇది చూసి భయపడిపోయినట్టున్నారు.. ఒక పోలీసు తల మీద హెల్మెట్ లా ప్లాస్టిక్ స్టూల్ పెట్టుకుంటే మరో పోలీసు రక్షణ కవచంలా ‘డాలు’ మాదిరి వెడల్పాటి గంప పట్టుకుని ముందుకు కదిలాడు. ఈ ఉద్రిక్తత . హింస తాలూకు వీడియో క్లిప్ లు చిన్నపాటివి వైరల్ అయ్యాయి. అయితే ఈ విచిత్ర ఉదంతంపై పోలీసు ఉన్నతాధికారులు మండిపడ్డారు. అక్రమ్ పూర్ పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ని సస్పెండ్ చేశారు. అసలు ఈ మొత్తంఘటనపై విచారణకు ఆదేశించారు.

తాము అన్ని జిల్లాల పోలీసు స్టేషన్లకు తగిన రక్షణ సాధనాలు పంపామని…కానీ వీరిలా చవకబారు వస్తువులు పట్టుకోవడమేమిటని పోలీసు శాఖ ట్విటర్ ద్వారా ఓ స్టేట్ మెంట్ విడుదల చేసింది. ఇంకా ఇదే ప్రాంతంలో కొంతమంది పోలీసులు ఓ చెట్టు చాటున నక్కిన దృశ్యాలు కూడా ఉన్నాయి. వీటినన్నిటిని అధికారులు పరిశీలిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Corona Vaccination: త్వరలో పలు విదేశీ టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశం.. ఏ టీకాలు ఎప్పటిలోగా వస్తాయి?

FIR on Baba Ramdev: మరో కేసులో ఇరుక్కున్న రాందేవ్ బాబా.. వైద్యుల ఫిర్యాదు మేరకు రాయ్‌పూర్‌లో ఎఫ్ఐఆర్ నమోదు