జనాభా అదుపునకు ఉద్దేశించి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 2021-2030 సంవత్సరానికి కొత్త పాపులేషన్ పాలసీని ఆదివారం లాంచ్ చేశారు. 2026 సంవత్సరానికి బర్త్ రేటును ప్రతి వెయ్యి జనాభాకు 2.1 నిష్పత్తికి, 2030 నాటికి 1.9 నిష్పత్తికి తగ్గించాలని ఇందులో నిర్దేశించామన్నారు. రాష్ట్రంలో జనాభాను అదుపు చేయాలంటే ఇద్దరు బిడ్డల మధ్య గ్యాప్ (ఎడం) ఉండాలని ఆయన సూచించారు. జనాభా పెరుగుదల రాష్ట్రంతో బాటు దేశ అభివృద్ధికి కూడా అవరోధంగా మారుతుందన్నారు. ఇది పేదరికానికి కూడా కారణమవుతుందన్నారు.ఈ పాలసీలో ప్రతి కులాన్ని, వర్గాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని తగిన జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన చెప్పారు. ఈ పాలసీకింద అన్ని కుటుంబ నియంత్రణ చర్యలకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. కాగా-పాపులేషన్ కంట్రోల్ ముసాయిదా బిల్లు-2021 ను స్టేట్ లా కమిషన్ రూపొందించింది. దీనికి ఈ నెల 19 లోగా ప్రజల నుంచి సూచనలు, సలహాలను పంపవచ్చునని కోరింది.
ఇద్దరు బిడ్డలకు మించి సంతానం గలవారిని అన్ని ప్రభుత్వ ప్రయోజనాలకూ అనర్హులని స్పష్టం చేసిన విషయం గమనార్హం. అలాగే పరిమిత సంతానం గలవారికి ఉద్యోగాల్లో ప్రమోషన్లు, రెండు ఇంక్రిమెంట్లు,ఇతర ప్రయోజనాలను కల్పించాలని ఇందులో నిర్దేశించారు., ఇప్పటికే విశ్వ హిందూ పరిషద్ నేత సాధ్వి ప్రాచీ కూడా జనాభాను అదుపు చేయాలంటూ పిలుపునిచ్చారు. మరోవైపు అస్సాం ప్రభుత్వం కూడా ఇదే నినాదమిచ్చింది. టూ చైల్డ్ పాలసీని ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. అయితే యూపీ ప్రభుత్వం అప్పుడే ఈ పాలసీని రిలీజ్ చేయడం విశేషం. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని దీన్ని ప్రారంభిస్తున్నట్టు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పారు.
మరిన్ని ఇక్కడ చూడండి : News Watch : దేవుడితోనైనా కొట్లాడతాం..:కేటీఆర్.మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్…( వీడియో )
భారత్ లో మల్లి మొదలైన డెల్టా వేరియంట్ టెన్షన్ లైవ్ వీడియో..:Delta Variant Live Video.