Omicron JN.1 variant: కరోనా కొత్త వేరియంట్‎పై వీళ్లు భయపడాల్సిన పనిలేదు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..

దేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకు చాపకింద నీరులా పాకుతోంది. ఇదిలా ఉంటే కొత్తగా వచ్చిన జేఎన్.1 వేరియంట్ దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. కేరళలో ఒక వ్యక్తి మృతి చెందగా.. గోవాలో అత్యధికంగా వెలుగులోకి వచ్చాయి. దేశ వ్యాప్తంగా డిశంబర్ 21 నాటికి 22 కొత్త వేరియంట్ కేసులు యాక్టీవ్ లో ఉన్నట్లు తెలిపారు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

Omicron JN.1 variant: కరోనా కొత్త వేరియంట్‎పై వీళ్లు భయపడాల్సిన పనిలేదు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
Union Tourism Minister
Follow us
Srikar T

|

Updated on: Dec 24, 2023 | 11:33 PM

దేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకు చాపకింద నీరులా పాకుతోంది. ఇదిలా ఉంటే కొత్తగా వచ్చిన జేఎన్.1 వేరియంట్ దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. కేరళలో ఒక వ్యక్తి మృతి చెందగా.. గోవాలో అత్యధికంగా 19 కేసులు వెలుగులోకి వచ్చాయి. దేశ వ్యాప్తంగా డిశంబర్ 21 నాటికి 22 కొత్త వేరియంట్ కేసులు యాక్టీవ్ లో ఉన్నట్లు తెలిపారు కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు. ఇదిలా ఉంటే జేఎన్.1 కొత్త కరోనా వేరియంట్‎కి ఎవరూ భయపడనవసరం లేదని కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ అన్నారు. దక్షిణ గోవాలో పాంచజన్య వార పత్రిక ఆదివారం నిర్వహించిన ‘సాగర్ మంథర్ 2.0’ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు.

కరోనాతో మన దేశం గతేడాది పోరాడిందని.. ఇప్పుడు వచ్చే కొత్త వేరియంట్లపై ప్రజలు, పర్యటక పరిశ్రమలు ఎలాంటి భయాందోళనకు గురికానవసరం లేదని వివరించారు. మన దేశంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రగతిశీల విధానాలతో కరోనా బారినపడిన తరువాత కూడా అర్థికంగా చాలా త్వరగా కోలుకుందన్నారు. గతంలో కంటే కూడా కొత్త ఉపాధి అవకాశాలు టూరిజం రంగంలో పెరిగాయని చెప్పారు. ప్రస్తుతం నమోదవుతున్న కొత్త రకం కరోనాతో లాక్ డౌన్ విధించే అవకాశం ఉంటుందా అని కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ‘భయపడాల్సిన అవసరం లేదు. అది మళ్లీ వచ్చినా మనం పోరాడగలం. గతంలోనూ మనం ఈ మహమ్మారిపై పోరాడాం’’ అన్నారు.

ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది. కోవిడ్ టెస్టుల సంఖ్య పెంచాలని, ఆసుపత్రుల్లో పేషెంట్లకు బెడ్ల సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే కరోనా సోకిన వారికి ఐసోలేషన్ లో ఆక్సిజన్ బెడ్లను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించింది. ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్కులు ధరించాలని, అత్యవసరం అయితే తప్ప వృద్దులు, పసిపిల్లలు బయటకు రాకుడదని సూచనలు జారీ చేసింది. దీంతో రాష్ట్రప్రభుత్వాలు కరోనా పరీక్షలు పెద్ద ఎత్తులో చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..