అఖిల భారత మజ్లిస్ ఎ ఇత్తేహదుల్ ముస్లిమీన్ (AIMIM) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన కామెంట్స్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు శంషాబాద్‌లో ఓ వ్యాపారి ఇల్లు కట్టించారని, ఆయన ఇకపై ఇక్కడే ఉంటారని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన ఆరోపణలపై రియాక్ట్ అయ్యారు. అలాంటిది నిజమే అయితే ఆ స్థలంలో దళిత బంధువులు రాసిస్తామని అన్నారు. ఒక కుటుంబానికే.. పార్టీ, ప్రభుత్వం, రాష్ట్రం పరిమితమైందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గోదావరి, కృష్ణా నీళ్లతో పాటు ప్రాజెక్ట్‌లు అన్నీ గత ప్రభుత్వాలు, కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయన్నారు. వీళ్లు వచ్చాక కొత్తగా ఎక్కడా నీళ్లు రాలేదన్నారు. హైటెక్ సిటీ, ఫైనాన్సియల్ సిటీలో మాఫియా జరిగిందన్నారు. చివరకు రోడ్ల వెంట వేసే అడ్వర్టైజ్‌మెంట్ ఫ్లెక్సీల్లోనూ కొందరు నేతలు వాటాలు తీసుకున్నారని ఆరోపించారు.
విమర్శించడానికి ఏమీ లేకే.. అంబానీ, అదానీ గురించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. గతంలోనూ ఆయా కంపెనీలు ఉన్నాయన్నారు. ధాన్యం కొనుగోళ్లపైనా కేంద్రం ప్రతియేటా ఎంత ఖర్చు పెడుతుందో చెప్పేశారు. లెక్కలతో సహా వివరించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో చాలా కంపెనీలు మూతపడ్డాయన్నారు. వాటిల్లో కొన్నింటి పేర్లతో సహా ప్రస్తావించారు.
రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించేందు ఎన్నో మీటింగ్‌లు పెట్టినా.. కనీసం హాజరు కూడా కావడం లేదన్నారు. ఇద్దరు సీఎంలు దావత్ చేసుకుంటరు కానీ.. పరిష్కారం చేసుకోరని ఆరోపించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం