లాక్‌డౌన్‌: వారు ‘నో కరోనా’ అంటుంటే.. వీరు ‘ఆవో కరోనా’ అన్నట్లు వ్యవహరిస్తున్నారు

మొబైల్ వైరల్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్‌ను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, సంతోష్ గాంగ్వార్, కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి కేటీఆర్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ..  ప్రపంచ వ్యాప్తంగా కరోనా వల్ల విపత్కర పరిస్థితులు నెలకొన్నా.. సమిష్టి కృషితో సమర్ధవంతంగా భారత్ లో కరోనాపై పోరాటాన్ని కొనసాగిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా కరోనాపై పోరులో డీఆర్డీవో గొప్ప పాత్ర పోషిస్తుందని  తెలిపిన కిషన్ రెడ్డి.. డీఆర్డీఓ […]

లాక్‌డౌన్‌: వారు 'నో కరోనా' అంటుంటే.. వీరు 'ఆవో కరోనా'  అన్నట్లు వ్యవహరిస్తున్నారు
Follow us

| Edited By:

Updated on: Apr 23, 2020 | 2:36 PM

మొబైల్ వైరల్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్‌ను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, సంతోష్ గాంగ్వార్, కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి కేటీఆర్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ..  ప్రపంచ వ్యాప్తంగా కరోనా వల్ల విపత్కర పరిస్థితులు నెలకొన్నా.. సమిష్టి కృషితో సమర్ధవంతంగా భారత్ లో కరోనాపై పోరాటాన్ని కొనసాగిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా కరోనాపై పోరులో డీఆర్డీవో గొప్ప పాత్ర పోషిస్తుందని  తెలిపిన కిషన్ రెడ్డి.. డీఆర్డీఓ చైర్మన్ సతీశ్ రెడ్డికి అభినందనలు తెలిపారు. కరోనాను ఎదుర్కోవడంలో మొబైల్ వైరాలజీ ల్యాబ్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. టెస్టింగ్ సదుపాయాల కోసం ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోందని ఆయన వివరించారు.

ఇక కరోనాపై ప్రభుత్వ పోరు గురించి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో మార్చి 15 వరకు ఒక ల్యాబ్ మాత్రమే పుణెలో ఉండేది.. ఇప్పుడు దేశవ్యాప్తంగా 302 టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 755 కోవిడ్ ఆసుపత్రులను ప్రత్యేకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని.. అలాగే 3060 క్వారంటైన్ సెంటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. దేశానికి కావాల్సిన పీపీఈ కిట్స్ తయారు చేసుకుంటున్నామని, వెంటిలేటర్లను తయారు చేసుకుంటున్నామని, అందరం కలిసికట్టుగా కరోనాను ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. తబ్లీగి జమాత్ కారణంగా తెలంగాణ , ఏపీ,  ఢిల్లీ, జమ్మూ కశ్మీర్ లో అధిక కేసులున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రజలు లాక్ డౌన్ ను బాగా పాటిస్తున్నారని ఆయన కితాబిచ్చారు. గ్రామీణ ప్రజలు ‘నో కరోనా’ అంటుంటే పట్టణ ప్రజలు ‘ఆవో కరోనా’ అన్నట్టు వ్యవహరిసస్తున్నారని ఆయన అన్నారు.

Read This Story Also: స్టార్‌ హీరో తనయుడితో ‘ఉప్పెన’ రీమేక్‌..!