
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి రేర్ ఎర్త్, కీలక ఖనిజాల భద్రతపై ప్రత్యేక అంతర్ మంత్రిత్వ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అణుఊర్జా, ఉక్కు, భారీ పరిశ్రమలు, వాణిజ్య శాఖల అధికారులతో పాటు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమార స్వామి కూడా పాల్గొన్నారు.
సరఫరా భద్రతపై చర్చ:
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక శక్తి (ఎనర్జీ), జాతీయ భద్రతకు కీలకమైన ఖనిజాల సరఫరాను నిరంతరం కొనసాగించేందుకు అనుసరించాల్సిన మార్గాలపై ఈ సమాశేశంలో చర్చించారు. మైనింగ్ నుంచి రిఫైనింగ్ వరకు.. అలాగే ఆఖరి వినియోగ దశ వరకు మొత్తం వ్యవస్థను బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టడంపై ఈ మీటింగ్‌లో కీలక చర్చ జరిగింది.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రం ప్రారంభించిన జాతీయ కీలక ఖనిజ మిషన్ అమలు ప్రణాళికలపై సమీక్ష జరిపారు. ఖనిజ రంగంలో స్వయం సమృద్ధిని సాధించడంపై ప్రభుత్వం ఆత్మనిర్భర్ దృష్టితో వ్యవహరిస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు.
“విలక్షణ, కీలక ఖనిజాల సరఫరా వ్యవస్థను బలపరచడం.. వాటి వినియోగ ప్రక్రియలను మెరుగుపరచడం ద్వారా దేశాన్ని ఆత్మనిర్భరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం” అని మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Discussions focused on strengthening the value chain, from mining to refining to end-use. @narendramodi govt has implemented the National Critical Mineral Mission (NCMM) and is adopting a whole-of-government approach to make India #Atmanirbhar in minerals. pic.twitter.com/bWt2bIMAKP
— G Kishan Reddy (@kishanreddybjp) June 17, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..