Hindi Diwas – UNESCO: హిందీ భాషను గుర్తిస్తూ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ (యునెస్కో) తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అభినందించారు. ఇది చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. హిందీ భాషకు ప్రపంచ గుర్తింపును నిర్ధారించే వేడుకగా ఆయన అభివర్ణించారు. మన జ్ఞానం, మన సంస్కృతిని వ్యాప్తి చేయడంలో హిందీ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తోందన్నారు. ప్రపంచ హిందీ దినోత్సవాన్ని పురస్కరించుకుని యునెస్కో , వరల్డ్ హెరిటేజ్ సెంటర్ (WHC) తన వెబ్‌సైట్‌లో భారతీయ వారసత్వ ప్రదేశాల హిందీ వివరణలను ప్రచురించాలని నిర్ణయించింది. యునెస్కో తీసుకున్న నిర్ణయాన్ని
ప్రపంచ హిందీ దినోత్సవం సందర్భంగా, UNESCO తన వెబ్‌సైట్‌లో భారతదేశంలోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల హిందీ వివరణను ప్రచురించడానికి అంగీకరించింది. ఈ సమాచారాన్ని సోమవారం పారిస్‌లోని ఐక్యరాజ్యసమితి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ (యునెస్కో)కి భారతదేశ శాశ్వత ప్రతినిధి బృందం పంచుకున్నట్లు తెలియజేసింది.
It is a proud moment for??
On the occasion of Hindi Diwas,@UNESCO‘s World Heritage Centre has agreed to publish Hindi descriptions of ??’s UNESCO World Heritage Sites on the WHC website
This historic decision is a celebration of Hindi ensuring global recognition to the language pic.twitter.com/d0LdBJFPvf
— G Kishan Reddy (@kishanreddybjp) January 11, 2022
“ప్రపంచ హిందీ దినోత్సవం సందర్భంగా UNESCO వరల్డ్ హెరిటేజ్ సెంటర్ భారతదేశంలోని UNESCO వరల్డ్ హెరిటేజ్ సైట్‌లలో ఒకటి అని వరల్డ్ హెరిటేజ్ సెంటర్ డైరెక్టర్ తెలియజేసినందుకు భారతదేశ శాశ్వత ప్రతినిధి బృందం సంతోషంగా ఉంది” అని పేర్కొంది. WHCలో హిందీ వివరణను ప్రచురించడానికి అంగీకరించింది. ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లుగా తెలిసారు. పారిస్‌లోని యునెస్కోకు భారతదేశ శాశ్వత ప్రతినిధి విశాల్ శర్మ ప్రకటించారు.
ఇవి కూడా చదవండి: Punjab Assembly Election 2022: వీటి చుట్టే తిరుగుతున్న పంజాబ్ ఎన్నికలు.. ఆశలన్నీ కింగ్ మేకర్‌పైనే..
Flamingos: ఫ్లెమింగోలు ఒంటికాలి జపం ఎందుకు చేస్తాయో తెలుసా.. దీని వెనుక ఓ సైన్స్..