Maha Kumbh 2025: ‘ఇది నా అదృష్టం..’ మహా కుంభమేళాలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ దంపతుల పవిత్ర స్నానం

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కుటుంబంతో కలిసి మహా కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించారు. త్రివేణి సంగమంలోని దివ్య జలాల్లో నా కుటుంబంతో కలిసి పవిత్ర స్నానం చేయడం గొప్ప అదృష్టం అని ఆయన అన్నారు. ఇక్కడ అమృత స్నానం చేయడం మరపురాని అనుభవం అని ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్‌ సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేశారు..

Maha Kumbh 2025: ఇది నా అదృష్టం.. మహా కుంభమేళాలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ దంపతుల పవిత్ర స్నానం
Union Minister Dharmendra Pradhan

Updated on: Feb 17, 2025 | 7:35 AM

ప్రయాగ్‌రాజ్‌, ఫిబ్రవరి 17: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన కుటుంబంతో పాటు ఆదివారం చేరుకున్నారు. అక్కడ ఆయన కుటుంబంతో సహా త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..144 యేళ్ల తర్వాత జరుగుతున్న ఈ మహా కుంభమేళాను అతీంద్రియ సంగమంగా అభివర్ణించారు. సాధువులు, మహాత్ములు, భక్తజన సంద్రం సమావేశమయ్యే చోటిది అని అన్నారు. మతం, విశ్వాసాలకు చెందిన గొప్ప పండుగని, ఇక్కడ అమృత స్నానం చేయడం మరపురాని అనుభవంగా తెలిపారు.

ఇంకా ఈ విధంగా మాట్లాడారు.. మహా కుంభ్‌లో పాల్గొనడం నా అదృష్టం. కుటుంబంతో ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. సనాతన సంస్కృతి గొప్పతనాన్ని, భక్తి విశిష్ట శక్తిని ప్రపంచం మొత్తం అనుభవిస్తున్న అద్భుతమైన ఘట్టం ఇది. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహిస్తున్న ప్రధాని మోడీ, సీఎం యోగి ఆదిత్యనాథ్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మహా కుంభమేళాలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన భార్యతో కలిసి పవిత్ర సంగమ తీరాల వద్ద పూజలు చేశారు.

ఇవి కూడా చదవండి

దీని గురించి ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టు కూడా పెట్టారు. ‘మహాకుంభ్ సనాతన నాగరికత, సంస్కృతి, తత్వశాస్త్రం, మన సనాతన సంప్రదాయాల సజీవతకు నిదర్శనం. గంగా, యమున, సరస్వతి నదుల దివ్య సంగమ ప్రదేశంలో నా కుటుంబంతో కలిసి పవిత్ర స్నానం చేయడం నేను చేసుకున్న అదృష్టం’.. అని ఈ పోస్టులో తెలిపారు. మరొక పోస్ట్‌లో ‘144 సంవత్సరాల తర్వాత కోట్లాది భక్త జనం సమావేశమయ్యే ఈ మహా కుంభమేళ దివ్య సంగమం. మహా కుంభమేళ కేవలం ఒక పండుగ కాదు. వేల సంవత్సరాల నాటి భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక చైతన్యానికి ఒక సజీవ జ్యోతి’ అని రాసుకొచ్చారు. సనాతన సంస్కృతి గొప్పతనాన్ని, విశ్వాసం విశిష్ట శక్తిని ప్రపంచం మొత్తం అనుభవిస్తున్న దివ్య సందర్భం ఇది అని మంత్రి అన్నారు. అందరి సంక్షేమం కోసం గంగా తల్లిని ప్రార్థించానని, ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సమర్థ నాయకత్వంలో ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.