AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం! భయంతో పరుగులు తీసిన ప్రజలు

ఢిల్లీ సమీపంలోనే భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ప్రస్తుతానికి, ఈ భూకంపం వల్ల ఎటువంటి నష్టం అయితే జరగలేదు. అయినా భూ ప్రకంపనలు తీవ్రంగా కనిపించడంతో ఢిల్లీ పోలీసులు అత్యవసర హెల్ప్‌లైన్ 112ను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..

Earthquake in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం! భయంతో పరుగులు తీసిన ప్రజలు
Earthquake In Delhi
SN Pasha
|

Updated on: Feb 17, 2025 | 9:52 AM

Share

దేశ రాజధాని ఢిల్లీలో ఈ రోజు తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఉదయం 5.30 గంటల ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చాయి. భూకంప తీవ్రత 4.0గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. ఒక్కసారిగా ఇళ్లు కంపించడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. నిద్రలోంచి ఉలిక్కిపడి లేచి.. రోడ్లపైకి వెళ్లిపోయారు. అయితే ఈ భూకంపం 5 కిలోమీటర్ల లోతులో సంభవించింది. ఢిల్లీ సమీపంలోనే భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ప్రస్తుతానికి, ఈ భూకంపం వల్ల ఎటువంటి నష్టం అయితే జరగలేదు. అయినా భూ ప్రకంపనలు తీవ్రంగా కనిపించడంతో ఢిల్లీ పోలీసులు అత్యవసర హెల్ప్‌లైన్ 112ను ఏర్పాటు చేశారు.

ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. భూకంపం నేపథ్యంలో ఎవరికి ఎలాంటి సాయం కావాలన్నా హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని కోరారు. జనవరి 23న, చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతంలో 80 కిలోమీటర్ల లోతులో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించిన తరువాత ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో శక్తివంతమైన ప్రకంపనలు సంభవించాయి. అంతకుముందు, జనవరి 11న, ఆఫ్ఘనిస్తాన్‌లో 6.1 తీవ్రతతో కూడిన భూకంపం కారణంగా ఢిల్లీ, ఎన్‌సిఆర్‌లలో తేలికపాటి ప్రకంపనలు సంభవించాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ భూకంప జోనేషన్ మ్యాప్ ప్రకారం, ఢిల్లీ భూకంప జోన్ 4 పరిధిలోకి వస్తుంది, దీని వలన భూకంపాలకు ఎక్కువ అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన లైవ్..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన లైవ్..
టాస్ గెలిచిన చెన్నై.. లక్నోతో పోరులో రుతురాజ్ సేన వ్యూహం ఇదే..!
టాస్ గెలిచిన చెన్నై.. లక్నోతో పోరులో రుతురాజ్ సేన వ్యూహం ఇదే..!
ఇంటి బాత్రూంలో కుప్పులుగా నోట్ల కట్టలు.. దెబ్బకు కెరీర్ క్లోజ్..
ఇంటి బాత్రూంలో కుప్పులుగా నోట్ల కట్టలు.. దెబ్బకు కెరీర్ క్లోజ్..
CBSE 12వ తరగతి 2026 ఫలితాలపై వీడిన ఉత్కంఠ.. ముహూర్తం ఫిక్స్!
CBSE 12వ తరగతి 2026 ఫలితాలపై వీడిన ఉత్కంఠ.. ముహూర్తం ఫిక్స్!
కోట్లు కుమ్మరించినా కొంపముంచిన నలుగురు.. ఇంత దిగజారిపోయారేంట్రా.!
కోట్లు కుమ్మరించినా కొంపముంచిన నలుగురు.. ఇంత దిగజారిపోయారేంట్రా.!
సామాన్యులపై ధరల వాత.. మళ్లీ పెరగనున్న నిత్యవసరాల ధరలు
సామాన్యులపై ధరల వాత.. మళ్లీ పెరగనున్న నిత్యవసరాల ధరలు
బేగంపేట్ నుంచి HICCకి బయలుదేరిన మోదీ
బేగంపేట్ నుంచి HICCకి బయలుదేరిన మోదీ
ఏసీ రిమోట్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే కరెంట్ బిల్లు సగానికి సగం..
ఏసీ రిమోట్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే కరెంట్ బిల్లు సగానికి సగం..
తల్లిని బిడ్డకు మొదటి గురువు ఎందుకు అంటారు? ప్రతి తల్లి...
తల్లిని బిడ్డకు మొదటి గురువు ఎందుకు అంటారు? ప్రతి తల్లి...
రేర్ ఫొటోస్ షేర్ చేసిన చిరంజీవి.. పవన్‌ను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు
రేర్ ఫొటోస్ షేర్ చేసిన చిరంజీవి.. పవన్‌ను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు