Swachh Bharat Mission: స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్..

|

Oct 01, 2023 | 3:37 PM

అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈరోజు దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ‘స్వచ్ఛతాహి సేవా’లో భాగంగా చుట్టుపక్కల ఉన్న పరిసరాల పరిశుభ్రత కోసం ఓ గంట పాటు శ్రమదానం చేయాలని ఆయన కోరారు. దీంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా చోట్ల.. రాజకీయ నేతలు, ప్రముఖులు, ఉద్యోగులు, విద్యార్థులు ఇలా అన్ని రంగాలకు చెందినవారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తమ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెత్తను ఎత్తిపోస్తూ పరిశుభ్రం చేస్తున్నారు.

Swachh Bharat Mission: స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్..
Union Minister Anurag Thakur
Follow us on

అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈరోజు దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ‘స్వచ్ఛతాహి సేవా’లో భాగంగా చుట్టుపక్కల ఉన్న పరిసరాల పరిశుభ్రత కోసం ఓ గంట పాటు శ్రమదానం చేయాలని ఆయన కోరారు. దీంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా చోట్ల.. రాజకీయ నేతలు, ప్రముఖులు, ఉద్యోగులు, విద్యార్థులు ఇలా అన్ని రంగాలకు చెందినవారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తమ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెత్తను ఎత్తిపోస్తూ పరిశుభ్రం చేస్తున్నారు.ఇదిలా ఉండగా.. కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రధాని పిలుపు మేరకు.. హిమాచల్‎ప్రదేశ్‌‌ హరీమ్‌పూర్‌లోని బాబా బలక్ నాథ్ ఆలయం వద్ద నిర్వహించిన స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడున్న స్థానిక వాసులతో కలసి చెత్తను ఎత్తి ఆ ప్రాంతాన్ని పరిశుభ్రం చేశారు. అలాగే అక్కడి స్థానిక ప్రజలతో కలిసి పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేశారు. అలాగే స్వచ్ఛ అభియాన్ 3.0 మిషన్ ప్రారంభమైందని.. దేశ ప్రజలు ఈ కార్యక్రంలో పాల్గొంటారని ఆశిస్తున్నామని.. ముఖ్యంగా యువత ఈ కార్యక్రమంపై ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. మరోవైపు ప్రధాని మోదీ ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ అయిన అంకిత్‌ బైయాన్‌పురియా తో కలిసి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వయంగా చీపురు పట్టి ఊడ్చి.. చెత్తను గంపల్లోకి ఎత్తారు. అలాగే ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్‌ చేశారు. దేశప్రజలు స్వచ్ఛతపై దృష్టి పెడుతున్న తరుణంలో.. అంకిత్ బైయాన్‌పురియా, నేను కలిసి ఇదే కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు. ఇది కేవలం పరిశుభ్రతకు మాత్రమే కాకుండా.. ఫిట్‌నెస్, ఆరోగ్యాన్ని కూడా ఇందులో మిళితం చేస్తామని పేర్కొన్నారు. అలాగే ఈ కార్యక్రమం పరిశుభ్రత, ఆరోగ్య భారతం సందేశాన్ని అందిస్తోందని ప్రధాని అన్నారు.