Anurag Thakur: చిరంజీవి, నాగార్జునతో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ భేటీ.. ఎందుకో తెలుసా..?

|

Feb 27, 2023 | 11:27 AM

తెలంగాణ పర్యటనకు విచ్చేసిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. టాలీవుడ్ ప్రముఖులతో భేటీ అయ్యారు. అనురాగ్ ఠాకూర్ ఆదివారం రాత్రి మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు.

Anurag Thakur: చిరంజీవి, నాగార్జునతో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ భేటీ.. ఎందుకో తెలుసా..?
Anurag Thakur Tollywood
Follow us on

తెలంగాణ పర్యటనకు విచ్చేసిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. టాలీవుడ్ ప్రముఖులతో భేటీ అయ్యారు. అనురాగ్ ఠాకూర్ ఆదివారం రాత్రి మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు. అక్కడ చిరంజీవితో పాటు నాగార్జున, అల్లు అరవింద్‌ సహా పలువురు ప్రముఖులతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు విషయాల గురించి కేంద్ర మంత్రి ఠాకూర్, సినీ ప్రముఖులతో చర్చించారు.

కాగా, దీనికి సంబంధించిన ఫోటోలను చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. హైదరాబాద్‌ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. తన వద్దకు రావడానికి సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమ, వేగవంతమైన పురోగతి గురించి.. తన సోదరుడు నాగార్జునతో కలిసి కేంద్ర మంత్రితో జరిపిన ఆహ్లాదకరమైన చర్చ జరగడం మంచి పరిణామమని చిరంజీవి ట్వీట్ లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్బంగా టాలీవుడ్ లో నెలకొన్న సమస్యలు, కేంద్ర సహకారం తదితర విషయాల గురించి ఠాకూర్.. చిరంజీవి, నాగార్జున చర్చించినట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం..