Amit Shah: కర్ణాటక పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. అసలు కారణం అదేనా?

అధికారిక సమావేశాలతో పాటు రాష్ట్రంలోని బూత్ స్థాయి కార్యకర్తలు, పార్టీ నేతలతో ఎన్నికల వ్యూహంపై షా చర్చించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్-మే మధ్య రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Amit Shah: కర్ణాటక పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. అసలు కారణం  అదేనా?
Amit Shah

Updated on: Dec 28, 2022 | 5:28 AM

Union Home Minister Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన రెండు రోజుల పర్యటన నిమిత్తం డిసెంబర్ 30న కర్ణాటకలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మంత్రివర్గ విస్తరణ కోసం ఎదురుచూస్తున్న సమయంలో, అనేక వర్గాల నుంచి రిజర్వేషన్ల డిమాండ్ మధ్య హోంమంత్రి ఈ పర్యటన చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తున్నారు.

అధికారిక సమావేశాలతో పాటు రాష్ట్రంలోని బూత్ స్థాయి కార్యకర్తలు, నేతలతో ఎన్నికల వ్యూహంపై షా చర్చించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్-మే మధ్య రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ముఖ్యమంత్రి బొమ్మై సోమవారం హోంమంత్రి షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. డిసెంబర్ 29 రాత్రికి షా బెంగళూరు చేరుకుంటారని, డిసెంబర్ 30న మండ్యలో భారీ డెయిరీని ప్రారంభించి, బహిరంగ సభలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అక్కడ డిసెంబర్ 31న అల్పాహార విందులో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..