AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్యాంకుల విలీనం.. నిరసనల వెల్లువ..మోదీ సర్కార్ మూడో వ్యూహం

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకుల విలీనం వల్ల దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ ఏర్పడుతుందని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించారు. దీనివల్ల రూ. 14. 59 లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుందని, ఇది యూనియన్ బ్యాంకు బిజినెస్ కన్నా దాదాపు రెండు రెట్లు ఎక్కువని ఆమె అన్నారు. ఈ విలీనం వల్ల బ్యాంకులు బలోపేతమవుతాయని, వీటి లెండింగ్ ఎబిలిటీ (రుణాలిచ్ఛే సామర్థ్యం) పెరుగుతుందని ఆమె పేర్కొన్నారు. అయితే విలీనం […]

బ్యాంకుల విలీనం.. నిరసనల వెల్లువ..మోదీ సర్కార్ మూడో వ్యూహం
Anil kumar poka
|

Updated on: Aug 31, 2019 | 5:34 PM

Share

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకుల విలీనం వల్ల దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ ఏర్పడుతుందని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించారు. దీనివల్ల రూ. 14. 59 లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుందని, ఇది యూనియన్ బ్యాంకు బిజినెస్ కన్నా దాదాపు రెండు రెట్లు ఎక్కువని ఆమె అన్నారు. ఈ విలీనం వల్ల బ్యాంకులు బలోపేతమవుతాయని, వీటి లెండింగ్ ఎబిలిటీ (రుణాలిచ్ఛే సామర్థ్యం) పెరుగుతుందని ఆమె పేర్కొన్నారు. అయితే విలీనం అనంతరం ఇవి స్వతంత్రంగా పని చేస్తాయని స్పష్టం చేశారు. (అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా విలీనమవుతాయని, రూ. 18 లక్షల కోట్ల వ్యాపార లావాదేవీలతో దేశంలో అతి పెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ ఏర్పాటవుతుందని కూడా ఆమె చెప్పారు).

అయితే ఈ విలీనం వల్ల ఉద్యోగుల తొలగింపునకు అవకాశాల్లేవని, నిజానికి వారికి ఇది ఎంతో ప్రయోజనకరమని ఫైనాన్స్ సెక్రటరీ రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఏ దశలోనూ ఏ ఉద్యోగికీ హాని జరగదని అభయమిచ్చారు. కానీ.. ఈ విలీనాల పట్ల బ్యాంకింగ్ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, యుబీఐ ల విలీన ప్రకటన తమకు షాక్ ఇచ్చిందని బ్యాంకు అధికారుల సమాఖ్య ఖండించింది. ఈ నిర్ణయం సముచితం కాదని సమాఖ్య ప్రధాన కార్యదర్శి సతీష్ శెట్టి అంటున్నారు. ఇటీవలే కార్పొరేషన్ బ్యాంక్ రూ. 9,086 కోట్ల మూలధనాన్ని ఆర్జించిందని ఆయన చెప్పారు. అసలు ఈ విలీనాలు బ్యాంకుల ప్రయివేటీకరణ దిశగా సాగుతాయని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆనాడే తన నివేదికలో పేర్కొన్నారని ఆలిండియా నేషనలైజ్డ్ బ్యాంక్ ఆఫీసర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జీ.వీ. మానిమారన్ గుర్తు చేశారు.

ఆర్ధిక రంగ సంస్కరణలపై ఏర్పాటైన కమిటీకి రాజన్ ఆనాడే ఈ మేరకు నివేదిక సమర్పించారని తెలిపారు. 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసి 4 బ్యాంకులుగా మార్చే యోచనను బ్యాంకు యూనియన్లు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. సిండికేట్ బ్యాంకు కెనరా బ్యాంకుతోను, ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనూ, ఇండియన్ బ్యాంకు అలహాబాద్ బ్యాంకులోనూ విలీనం కానున్నాయి. దీంతో దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 19 నుంచి 12 కి తగ్గనున్నాయి. దేశ ఆర్ధిక వ్యవస్థ గడ్డు పరిస్థితుల్లో ఉన్న ఈ తరుణంలో ఈ విలీనాలప్రతిపాదన ఎంతవరకు సముచితమని ఈ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మొదట జమ్మూకాశ్మీర్ స్వయం ప్రతిపత్తికి ఉద్దేశించిన 370 అధికరణాన్ని రద్దు చేయడం, ఆ తరువాత అసోం లో ఎన్నార్సీని చేపట్టడం, తాజాగా ఈ బ్యాంకుల విలీనానికి శ్రీకారం చుట్టడం వెనుక ఉద్దేశాలను విశ్లేషకులు తర్కించుకుంటున్నారు.