రైలు ప్రయాణికులకు చేదువార్త.. రేపటినుంచి సర్వీస్ ఛార్జీల మోత

రైల్వే ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. రైల్ టికెట్లపై సర్వీస్ చార్జీని భారీగా వసూలు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఆదివారం నుంచి ఈ చార్జీలు అమల్లోకి రానున్నాయి. దీనిపై ఇప్పటికే రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నా.. అమలు చేయడంలో మాత్రం ఆలస్యమైంది. రేపటినుంచి అమలయ్యే సర్వీస్ ఛార్జీలు చూస్తే నాన్ ఏసీ టికెట్లపై రూ.15( ఒక్క టిక్కెట్టు), ఏసీ క్లాస్ టికెట్లపై రూ.30 సర్వీస్ ఛార్జీ వసూలు చేయనున్నారు. వీటితో పాటు జీఎస్టీ అదనంగా వసూలు చేస్తారు. ఐఆర్‌సీటీసీ […]

రైలు ప్రయాణికులకు చేదువార్త.. రేపటినుంచి సర్వీస్ ఛార్జీల మోత

రైల్వే ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. రైల్ టికెట్లపై సర్వీస్ చార్జీని భారీగా వసూలు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఆదివారం నుంచి ఈ చార్జీలు అమల్లోకి రానున్నాయి. దీనిపై ఇప్పటికే రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నా.. అమలు చేయడంలో మాత్రం ఆలస్యమైంది. రేపటినుంచి అమలయ్యే సర్వీస్ ఛార్జీలు చూస్తే నాన్ ఏసీ టికెట్లపై రూ.15( ఒక్క టిక్కెట్టు), ఏసీ క్లాస్ టికెట్లపై రూ.30 సర్వీస్ ఛార్జీ వసూలు చేయనున్నారు. వీటితో పాటు జీఎస్టీ అదనంగా వసూలు చేస్తారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు ఇది వర్తించనుంది.

దేశంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా గతంలో వసూలు చేసిన సర్వీస్ ఛార్జీలకు వెసులుబాటు కల్పించింది కేంద్రం. ఆ సమయంలో ఈ భారాన్ని కేంద్రమే భరించింది. తాజాగా ఈ భారం అధికం కావడంతో ఛార్జీలను ఐఆర్‌సీటీసీ భరించాలని చెప్పడంతో ఈ విధంగా వసూలు చేసేందుకు నిర్ణయించారు. గతంలో నాన్ ఏసీ టికెట్టుపై రూ.20, ఏసీ టికెట్‌పై రూ.40 ఛార్జీ ఉండేది. సర్వీస్ ఛార్జీల వసూలుపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ రైల్వేబోర్డుకు లేఖ రాయడంతో ఐఆర్‌సీటీసీ రేపటి నుంచి ఈ వసూలును ప్రారంభించనుంది.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu