Underwater Metro: త్వరలో నీటి అడుగున మెట్రో ట్రైన్.. త్వరలో టెస్ట్.. ఎక్కడ ఏ రాష్ట్రంలో ఈ సేవలు ప్రారంభం అంటే..

|

Apr 09, 2023 | 12:13 PM

నగర వాసుల ప్రయాణాన్ని సౌకర్యవంతం చేస్తూ మెట్రో సంస్థ తన సేవలను అందిస్తోంది. అయితే ఇప్పుడు మెట్రో మరో అడుగు ముందు అడుగు వేసి.. నీటి అడుగున నడవనుంది. అవును లండన్-పారిస్ తరహాలో భారత్ లో కూడా త్వరలో నీటి అడుగున మెట్రో నడవబోతోంది. అవును, దేశంలోనే తొలి నీటి అడుగున మెట్రో త్వరలో ప్రారంభం కానుంది.

Underwater Metro: త్వరలో నీటి అడుగున మెట్రో ట్రైన్.. త్వరలో టెస్ట్.. ఎక్కడ ఏ రాష్ట్రంలో ఈ సేవలు ప్రారంభం అంటే..
Underwater Metro
Follow us on

మనదేశంలో ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరవేయడానికి రైల్వే సంస్థ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో నగర వాసుల ప్రయాణాన్ని సౌకర్యవంతం చేస్తూ మెట్రో సంస్థ తన సేవలను అందిస్తోంది. అయితే ఇప్పుడు మెట్రో మరో అడుగు ముందు అడుగు వేసి.. నీటి అడుగున నడవనుంది. అవును లండన్-పారిస్ తరహాలో భారత్ లో కూడా త్వరలో నీటి అడుగున మెట్రో నడవబోతోంది. అవును, దేశంలోనే తొలి నీటి అడుగున మెట్రో త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే అండర్ వాటర్ ట్రైన్స్ టెస్ట్ చేస్తున్నారు. ఈ పరీక్షలు విజయవంతం అయిన తర్వాత ప్రారంభించనున్నారు.

దేశంలోనే తొలి నీటి అడుగున మెట్రో ట్రైన్ కోల్‌కతాలో ప్రారంభం కానుంది. ఇలా మెట్రో ట్రైన్ లో నీటి లోపల ప్రయాణిస్తూ వారు  మాల్దీవులల్లో ఉన్న అనుభూతిని పొందుతారు. కోల్‌కతాలోని హుగ్లీ నదిలో నిర్మించిన సొరంగం ద్వారా మొదటి నీటి అడుగున మెట్రో వెళుతుంది. ఇందులో 6 కోచ్‌లు ఉంటాయి. ఈ మెట్రో రైలు ప్రత్యేకతలు ఏమిటంటే?

పరీక్ష తర్వాత సర్వీస్ ప్రారంభం
కోల్‌కతా ఈస్ట్-వెస్ట్ మెట్రో ప్రాజెక్ట్ కింద 6-కోచ్‌ల రెండు మెట్రోలను టెస్టింగ్ చేయనుంది. ఈ మెట్రో ట్రైన్ ట్రయల్ ఎస్ప్లానేడ్ , హౌరా గ్రౌండ్ మధ్య 4.8 కి.మీ దూరంలో జరపనున్నారు.

ఇవి కూడా చదవండి

దేశంలోనే తొలి మెట్రో ట్రైన్  
1984లో కోల్‌కతాలో దేశంలోనే మొట్టమొదటి మెట్రో సర్వీసు ప్రారంభమైంది. అనంతరం 2002లో ఢిల్లీలో రెండో మెట్రోను ప్రారంభించారు. ఇప్పుడు చాలా నగరాల్లో మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు కోల్‌కతాలోనే తొలి నీటి అడుగున మెట్రోను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

డిసెంబర్ నాటికి పనులు పూర్తవుతాయి
KMRC అంటే కోల్‌కతా మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రకారం.. మొదటి నీటి అడుగున మెట్రో ట్రైన్ సేవలు ఈ సంవత్సరం డిసెంబర్ నుండి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన పనులు ఇంకా కొనసాగుతున్నాయని, త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు.

లండన్, ప్యారిస్ తరహాలో మెట్రో ట్రైన్ 
భారతదేశపు మొట్టమొదటి నీటి అడుగున మెట్రో రైలు లండన్-పారిస్ తరహాలో నడపనున్నారు. ఈ నీటి అడుగున మెట్రో ట్రైన్  లండన్ లోని యూరోస్టార్‌తో పోలుస్తారు. నీటి అడుగున రైలు ప్రారంభమైతే లక్షల మంది ప్రయాణికులకు ఉపశమనం లభించనుంది.

రూ. 120 కోట్లు ఖర్చు  
ఈ మెట్రో టన్నెల్‌ నిర్మాణానికి దాదాపు 120 కోట్లు వెచ్చించనున్నారు. అంతేకాదు హౌజ్ ఖాస్ తర్వాత, కోల్‌కతాలోని హౌరా స్టేషన్ గరిష్టంగా 33 మీటర్ల లోతుగా ఉంటుంది. ప్రస్తుతం, హౌజ్ ఖాస్ 29 మీటర్ల వరకు లోతైన స్టేషన్‌గా పరిగణించబడుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..