
ఉత్తరాఖండ్ హల్ద్వానీ జిల్లాలో హృదయ విదారకమైన సంఘటన చోటు చేసుకుంది. హల్దుచౌడ్‌లోని ఫ్యాక్టరీలో పనిచేస్తున్న అభిషేక్ అనే 20ఏళ్ల యువకుడు విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రైలు పట్టాల వద్ద అతడి మృతదేహన్ని గుర్తించిన పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆ యువకుడి మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ డ్రైవర్లు రూ.10 వేలకుపైగా డిమాండ్ చేశారు.
అంబులెన్స్‌కు అంత డబ్బులు చెల్లించలేక ఒక కుటుంబం ఇబ్బందిపడింది. అంత డబ్బు ఇచ్చుకోలేనని ఆ మహిళ ప్రాధేయపడినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఒక వాహనం టాప్‌పై యువకుడి మృతదేహాన్ని కట్టేసి గ్రామానికి తరలించారు.
BJP सरकार में जनता की क्या कद्र है, उसे समझने के लिए ये कहानी जान लीजिए 👇
उत्तराखंड के हल्द्वानी में 20 साल के अभिषेक की मौत हो गई। घर 200 किमी. दूर था, कोई भी शव ले जाने को राजी न हुआ।
एंबुलेंस वालों ने शव घर पहुंचाने के बदले बहन शिवानी से 12 हजार रुपए मांगे।
भाई की मौत का… pic.twitter.com/P1F3rS9t5Y
— Congress (@INCIndia) December 8, 2024
మరోవైపు ఈ విషయం తెలిసి ఉత్తరాఖండ్‌లో ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించింది. దీంతో సీఎం పుష్కర్ సింగ్ ధామి ఈ సంఘటనపై స్పందించారు. సమగ్ర విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వాలని ఆరోగ్యశాఖ కార్యదర్శిని కోరారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..