UK Variant: యూకే వేరియంట్‌ వల్లనే ఢిల్లీలో భారీగా కోవిడ్‌ కేసులు.. ఇండియాలో మొత్తం 1644 వేరియంట్‌ కేసులు

|

Apr 23, 2021 | 10:19 PM

UK Variant: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. అందుకు కారణం యూకే వేరియంటే కారణమని నిపుణులు చెబుతున్నారు. శాంపిళ్లను విశ్లేషించడం ద్వారా దీ..

UK Variant: యూకే వేరియంట్‌ వల్లనే ఢిల్లీలో భారీగా కోవిడ్‌ కేసులు.. ఇండియాలో మొత్తం 1644 వేరియంట్‌ కేసులు
Uk Variant
Follow us on

UK Variant: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. అందుకు కారణం యూకే వేరియంటే కారణమని నిపుణులు చెబుతున్నారు. శాంపిళ్లను విశ్లేషించడం ద్వారా దీని వెనుక యూకే స్ట్రెయిన్‌ వైరస్‌ అని తేలినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (NCDC) వెల్లడించింది. ఢిల్లీలో 400 కేసులు యూకే స్ట్రెయిన్‌కి, 76 ఇండియన్‌ డబుల్‌ మ్యుటెంట్‌ కేసులు కనిపించినట్లు వెల్లడించింది.
ఇప్పటి వరకు ఇండియాలో మొత్తం 1644 యూకే వేరియంట్‌ కేసులు, 112 సౌతాఫ్రికా,732 బ్రెజిల్‌ వేరియంట్‌ కేసులు ఉన్నాయి. మార్చిలోనే ఢిల్లీ శాంపిళ్లను పరిశీలించగా, యూకే వేరియంట్‌ రెట్టింపుపై మొత్తం 50 శాతానికి చేరినట్లు ఎన్‌సీడీసీ చెప్పింది. ఢిల్లీలో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేస్తున్న పది ల్యాబ్‌లలో ఎన్‌సీడీసీ కూడా ఒకటి.

ఢిల్లీలో కేసులు పెరగడానికి ప్రత్యక్షంగా యూకే వేరియంట్‌కే సంబంధం ఉన్నట్లు తేలిందని ఎన్‌సీడీసీ డైరెక్టర్‌ సుజీత్‌ కుమార్‌ సింగ్‌ స్పష్టం చేశారు. ఢిల్లీలో యూకే వేరియంట్‌, డబుల్‌ మ్యుటెంట్‌ రెండు ఉన్నాయి. మార్చి 2న మొత్తం కేసుల్లో 28 శాతంగా ఉన్న యూకే వేరియంట్‌ కేసులు మార్చి చివరి వారంలో 50 శాతానికి చేరినట్లు గుర్తించారు.

కాగా, మొత్తం 15,135 శాంపిళ్ల జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేశారు. ఇందులో ఈ మూడు వేరియంట్లు కలిపి 11.5 శాతం అంటే 1735 ఉన్నాయి. ఇక మహారాష్ట్రలోనూ 64 యూకే వేరియంట్‌ కేసులు ఉన్నట్లు గుర్తించారు. అలాగే తెలంగాణలోనూ 170 యూకే వేరియంట్‌ కేసులు ఉన్నట్లు ఈ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌లో తేలింది. మరో 57 సౌతాఫ్రికా వేరియంట్‌ కేసులు, మూడు డబుల్‌ మ్యుటెంట్‌ కేసులు తెలంగాణలో ఉన్నట్లు ఎన్‌సీడీసీ గుర్తించింది.

ఇవీ చదవండి: Coronavirus: రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో 225 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌.. సీపీ మహేష్‌ భగవత్‌

మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. గడిచిన 24 గంటల్లో 66,836 పాజిటివ్‌ కేసులు.. మరణాలు ఎన్నంటే..!

Corona Effect: భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం.. సంచలన నిర్ణం తీసుకున్న సింగపూర్‌