బ్రిటన్, నవంబర్ 16: కట్టుకున్న భార్యను దారుణంగా హతమార్చాడో కిరాతకుడు. స్క్రూడ్రైవర్‌తో 41 సార్లు పొడిచి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన టర్కీలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టర్కీలోని ఇస్తాంబుల్‌లోని ఫాతిహ్‌లోని ఒక హోటల్‌లో 26 ఏళ్ల మహిళ మెడ, శరీరంపై 41 గాయాలతో మరణించింది. ఆమెను హత్య చేసిప 28 ఏళ్ల బ్రిటిష్ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. సదరు బ్రిటిష్ వ్యక్తి తన భార్యను స్క్రూడ్రైవర్‌తో 41 సార్లు పొడిచి చంపాడు. సంఘటన సమయంలో మహిళ కేకలు విన్న హోటల్ సిబ్బంది గదిలోకి ప్రవేశించి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్న మహిళ కనిపించింది. దీంతో వెంటనే హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి చూడటంతో రక్తపు మడుగులో మహిళ అపస్మారక స్థితిలో కనిపించింది.
అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న వైద్య సిబ్బంది మహిళ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆమె గొంతుపై, శరీరం అంతటా గాయాలు కనిపించడంతో పరీక్షకులు ఆమెను స్క్రూడ్రైవర్‌తో హత్య చేసినట్లు నిర్ధారించారు. హత్య అనంతరం పారిపోవడానికి ప్రయత్నించిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పలుమార్లు స్క్రూడ్రైవర్‌తో పొడవడం వల్ల ఆమె మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదిక నిర్ధారించింది. నిందితుడిని అహ్మెత్ యాసిన్ ఎమ్ గా పోలీసులు గుర్తించారు. భార్యను హత్య చేసిన తర్వాత రక్తంతో తడిసిన టీ-షర్టుతోనే పోలీసులకు పట్టుబడ్డాడు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. హత్య చేసిన తర్వాత ఆయుధాన్ని టాయిలెట్ వేసి ఫ్లష్ చేసినట్లు పోలీసుల ఎదుట తెలిపాడు. ఈ సంఘటనకు మూడు రోజులు ముందు ఈ జంట యూకేకి వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
భార్యను దారుణంగా చంపిన బ్రిటిష్ టూరిస్ట్‌ని పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. అక్కడి కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ఫాతిహ్ మెవ్‌లనాకపి జిల్లాలోని హోటల్‌లో ఈ హత్య జరిగింది. ఇద్దరు టర్కీ పోలీసులు నిందితుడిని పోలీసు స్టేషన్ మెట్ల మీదికి తీసుకువెళుతున్నప్పుడు.. తల దించుకుని చేతికి సంకెళ్లు వేసుకుని ఉన్నట్లు కనిపిస్తోన్న నిందితుడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టర్కీలోని హోమిసైడ్ బ్యూరోలో నిందితుడిని విచారిస్తున్నారు. దాడి జరిగిన రోజున తన భార్య తనకు డ్రగ్స్ ఇచ్చిందని, ఇది వాగ్వాదానికి దారితీసిందని నిందితుడు పేర్కొన్నాడు. అయితే, హోటల్ గదిలో సోదాలు నిర్వహించగా.. డ్రగ్స్ ఆనవాళ్లు లభించలేదని పోలీసులు తెలిపారు. మానసిక రుగ్మతలకు మందులు వాడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కాగా, ఈ జంట నవంబర్ 11 న ఇంగ్లాండ్ నుంచి ఇస్తాంబుల్‌కు వచ్చారు. నవంబర్ 14 న వారు హోటల్‌కి వచ్చారు. అక్కడ విషాద సంఘటన జరిగింది. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.