Delhi: ఢిల్లీని కమ్మేసిన పొగమంచు., రోడ్లు కనిపించక జనం అవస్థలు, పడిపోయిన గాలి నాణ్యత..
నానాటికీ పెరుగుతున్న వాయుకాలుష్యం మానవాళి మనుగడకు ప్రశ్నార్థకంగా మారుతోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్రరూపం దాల్చుతోంది. గాలి పూర్తిగా కలుషితం కావడంతో జనజీవనం కష్టతరంగా మారింది. ఢిల్లీ సర్కార్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం కనిపించడంలేదు. గురువారం ఢిల్లీలో గాలి నాణ్యత మరోసారి తీవ్ర కేటగిరీలో కనిపించింది. కలుషిత గాలి కారణంగా ప్రజలు బయటకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు.
నానాటికీ పెరుగుతున్న వాయుకాలుష్యం మానవాళి మనుగడకు ప్రశ్నార్థకంగా మారుతోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్రరూపం దాల్చుతోంది. గాలి పూర్తిగా కలుషితం కావడంతో జనజీవనం కష్టతరంగా మారింది. ఢిల్లీ సర్కార్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం కనిపించడంలేదు. గురువారం ఢిల్లీలో గాలి నాణ్యత మరోసారి తీవ్ర కేటగిరీలో కనిపించింది. కలుషిత గాలి కారణంగా ప్రజలు బయటకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) తెలిపిన వివరాల ప్రకారం గురువారం ఢిల్లీలోని బవానాలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 442, ఐటీఓ(ITO)లో 415, జహంగీర్‌పురిలో 441, ద్వారకలో 417, అలీపూర్‌లో 415, ఆనంద్ విహార్, ఢిల్లీ విమానాశ్రయంలో 411గా నమోదయ్యింది. రాజధానిలోని చాలా ప్రాంతాల్లో పొగమంచు కమ్మేసింది. రోడ్లపై వెళ్లే వాహనదారులు, పాదచారులకు రోడ్డు కనిపించనంతగా మంచుకమ్మేయడంతో విజిబులిటీ మరింతగా క్షీణించింది. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం గురించి హర్షిత్ గుప్తా అనే యువకుడు స్పందిస్తూ.. తాను యూపీ నుంచి వచ్చానని, ఢిల్లీలో ఊపిరి పీల్చుకుంటుంటే పొగ పీల్చినట్లు అనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఢిల్లీలో ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడటం ఖాయమని గుప్తా పేర్కొన్నాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.