Train Fire Accident: న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం.! అకస్మాత్తుగా చెలరేగిన మంటలు.
వరుస రైలు ప్రమాద ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లో ఇటావా దగ్గర రైలులో మంటలు చెలరేగగా.. మూడు బోగీలు దగ్ధం అయ్యాయి. యూపీలోని ఇటావా సమీపంలోని సరాయ్ భూపత్ స్టేషన్ దగ్గరలో బుధవారం సాయంత్రం వేళ ఈ ఘటన జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
వరుస రైలు ప్రమాద ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లో ఇటావా దగ్గర రైలులో మంటలు చెలరేగగా.. మూడు బోగీలు దగ్ధం అయ్యాయి. యూపీలోని ఇటావా సమీపంలోని సరాయ్ భూపత్ స్టేషన్ దగ్గరలో బుధవారం సాయంత్రం వేళ ఈ ఘటన జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఎస్ 1 బోగీలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు మరో రెండు బోగీలకు వ్యాపించాయి. రైలు సారాయ్ భూపత్ స్టేషన్ మీదుగా వెళుతున్న సమయంలో ఎస్ 1 బోగీలోంచి పొగలు రావడం గమనించిన స్టేషన్ మాస్టర్ వెంటనే రైలును ఆపేశారు. ఆ తరువాత సిబ్బంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం, మంటలను ఆర్పాక రైలు గమ్యస్థానం వైపు బయలుదేరింది. ఈ ప్రమాదంలో కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని రైల్వే అధికారులు భావిస్తున్నారు. కాగా, మంటలను గుర్తించిన వెంటనే తాము రైలు కిటికీల్లోంచి దూకి బయటపడ్డామని ఓ ప్రయాణికుడు తెలిపాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
రూ. లక్ష క్యాష్ బ్యాగ్‌ను ఎత్తుకెళ్లిన శునకం..!
చరిత్ర సృష్టించిన ఆకలి.. రెండు పిజ్జాల ధర రూ.7,400 కోట్లా
సంకల్ప బలం.. చేతులతోనే ఎవరెస్ట్ ఎక్కిన మాజీ సైనికుడు
పిల్లల్ని కన్న తర్వాత ఆక్టోపస్ ఎందుకు చనిపోతుంది?
'ఫ్రెంచ్ సండే' ప్రత్యేకత ఏంటో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే
కాలానికి తగ్గట్టు రంగు మార్చే పక్షిని చూశారా
మందుల షాపు బోర్డుపై దేశభక్తి.. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి!

