దారుణం.. గాఢ నిద్రలో ఉన్న కుటుంబంపై ఏనుగుల దాడి.. ఇద్దరు చిన్నారుల మృతి

| Edited By: Ram Naramaneni

Nov 10, 2024 | 9:46 PM

ఏనుగుల దాడిపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన ఇద్దరు చిన్నారుల కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సాయం అందించారు. అటవీ ప్రాంతంలో ప్రజలు గుడిసెలు వేసుకుంటున్నారని అటవీ శాఖ అధికారులు తెలిపారు. అందువల్లే తరచూ ఏనుగుల దాడి ఘటనలు జరుగుతున్నట్టుగా ఆరోపించారు.

దారుణం.. గాఢ నిద్రలో ఉన్న కుటుంబంపై ఏనుగుల దాడి.. ఇద్దరు చిన్నారుల మృతి
Elephants
Follow us on

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఆదివారం తెల్లవారుజామున సూరజ్ పూర్ జిల్లా ప్రేమ్ నగర్ ప్రాంతంలోని చిట్‌ఖాయ్ గ్రామంలో ఓ కుటుంబంపై దాడి చేసి ఇద్దరిని చంపేశాయి. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఏనుగుల గుంపు వారి కుటుంబంపై దాడి చేసింది. గాఢనిద్రలో ఉన్న ఇద్దరు చిన్నారుల్ని తొక్కి చంపేశాయి. తల్లిదండ్రులు ప్రాణాలతో బయటపడ్డారు. మృతి చెందిన చిన్నారులను బిసు పండో(11),కాజల్ (5)గా గుర్తించారు. పిల్లలిద్దరూ గాఢ నిద్రలో ఉండటం వల్ల ఏనుగుల నుంచి తప్పించుకోలేక పోయారని అధికారులు తెలిపారు.

జరిగిన దారుణంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ సంఘటన స్థానికులలో భయాందోళనలకు గురిచేసింది. వారు ఇళ్లలో ఉండాలంటేనే వారంతా భయంతో వణికిపోతున్నారు. సూరజ్‌పూర్‌లోని రామానుజ్‌నగర్‌లో గత కొన్ని రోజులుగా 11 ఏనుగుల గుంపు సంచరిస్తోందని స్థానికులు తెలిపారు. కాగా గత 25 రోజుల్లో ఛత్తీస్‌గఢ్‌లో ఏనుగుల దాడిలో 9 మంది మరణించడం గమనార్హం.

ఏనుగుల దాడిపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన ఇద్దరు చిన్నారుల కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సాయం అందించారు. అటవీ ప్రాంతంలో ప్రజలు గుడిసెలు వేసుకుంటున్నారని అటవీ శాఖ అధికారులు తెలిపారు. అందువల్లే తరచూ ఏనుగుల దాడి ఘటనలు జరుగుతున్నట్టుగా ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..