Online T-Shirts: ఆన్‌లైన్‌లో టీ షర్ట్స్ కొంటున్నారా? అయితే ఇది తెలుసుకోకుంటే అంతే సంగతులు..!

ఆన్లైన్‌లో ఈ టీ షర్ట్స్ కొంటున్నారా? జర్ర జాగ్రత్త.. గ్యాంగ్‌స్టర్ల ముఖ చిత్రాలతో ఉన్న టీషర్టులను తమ వెబ్ సైట్లో విక్రయిస్తున్నట్టుగా మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో పాటు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు దావూద్ ఇబ్రహీం ఫోటోలతో కూడిన టీ-షర్టులను ఫ్లిప్‌కార్ట్, అలీఎక్స్‌ప్రెస్, టీషాపర్‌లు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

Online T-Shirts: ఆన్‌లైన్‌లో టీ షర్ట్స్ కొంటున్నారా? అయితే ఇది తెలుసుకోకుంటే అంతే సంగతులు..!
Maharashtra Police Book E Commerce Platforms For Promoting T Shirts Glorifying Gangsters
Follow us
Ranjith Muppidi

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 10, 2024 | 9:45 PM

ఈ కామర్స్ వెబ్ సైట్లు ఫ్లిప్‌కార్ట్, అలీ ఎక్స్ ప్రెస్, టీషాపర్లపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. గ్యాంగ్‌స్టర్ల ముఖ చిత్రాలతో ఉన్న టీషర్టులను తమ వెబ్ సైట్లో విక్రయిస్తున్నట్టుగా మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో పాటు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు దావూద్ ఇబ్రహీం ఫోటోలతో కూడిన టీ-షర్టులను ఫ్లిప్‌కార్ట్, అలీఎక్స్‌ప్రెస్, టీషాపర్‌లు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వీరిలో ఒకరు పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా హత్యతో సహా అనేక హత్య కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నాడు. దావూద్ ఇబ్రహీం ఉగ్రవాద దాడులను పాల్పడ్డాడు. పెద్దలతో పాటు చిన్న పిల్లల సైజుల్లో కూడా ఈ టీ షర్ట్స్‌ను అందుబాటులో ఉంచడం గమనార్హం. ఈ ఉత్పత్తులు నేరపూరిత జీవనశైలిని ప్రోత్సహిస్తాయని, యువతపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.

ఇటువంటి చర్యలు సామాజిక విలువలను క్షీణింపజేయడమే కాకుండా తీవ్రమైన నేరాలను సైతం చిన్నదిగా చూపించే ప్రమాదం కలిగి ఉంది. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను గ్లామరైజ్ చేసే ప్రమాదకరమైన మెసేజ్‌‌‌ను యువతకు పంపుతుంది. వ్యాపారం పేరుతో హింసను హీరోయిజంగా చూపిస్తున్నట్లు మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. ఈ వెబ్ సైట్ సంస్థలపై పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్టు వారు తెలిపారు. ఇందులో 192 (అల్లర్లు సృష్టించి రెచ్చగొట్టే ఉద్దేశం) 196 (వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 353 (ప్రజా దురాచారం) వంటి సెక్షన్లు ఉన్నాయి. దీనిపై స్పందించిన సంస్థ పొరపాటును సరిదిద్దుకుంటామని వివరణ ఇచ్చింది.

మరన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!