AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోడిపుంజు ఆకారంలో నిర్మించిన హోటల్‌..! గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బ్రేక్..ఈ భవనంలో అడుగుపెడితే..

గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నుండి ప్రతిసారీ ఏదో ఒక ప్రత్యేకత వెలుగులోకి వస్తుంది. ఈ సారి కోడిపుంజు ఆకారంలో ఉన్న హోటల్ ఒకటి సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది. ఈ బిల్డింగ్‌ పొడవు, వెడల్పు , ఆకృతి కారణంగా గిన్నిస్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది.

కోడిపుంజు ఆకారంలో నిర్మించిన హోటల్‌..! గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బ్రేక్..ఈ భవనంలో అడుగుపెడితే..
Chicken Shape Resort Hotel
Jyothi Gadda
|

Updated on: Nov 10, 2024 | 7:42 PM

Share

ప్రపంచంలోనే అతిపెద్ద కోడిపుంజు ఆకారంలో ఉన్న ఎత్తైన భవనాన్ని మీరు ఎక్కడైనా చూశారా..? లేదుకాదా.. అయితే, దీని కోసం మీరు ఫిలిప్పీన్స్‌కు వెళ్లవలసి ఉంటుంది. ఆర్కిటెక్చర్, వాస్తుశిల్పులపై ఆసక్తి ఉన్నవారికి ఈ భవనం ఎంతగానో నచ్చుతుంది. క్యాంపుస్టోహాన్, నీగ్రోస్ ఆక్సిడెంటల్‌లో ఉన్న ఈ భారీ నిర్మాణం క్యాంపుస్టోహాన్ హైలాండ్ రిసార్ట్‌లో భాగంగా నిర్మించారు.

ఈ భవనం పొడవు సుమారు 115 అడుగులు (34.931 మీటర్లు), వెడల్పు సుమారు 40 అడుగులు (12.127 మీటర్లు). 92 అడుగుల పొడవుతో ఆకట్టుకునేలా కట్టడం అంటే చిన్న విషయం కాదు. కోడి ఆకారంలో ఉన్న ఈ భవనంలో 15 గదులు ఉన్నాయి. ఇందులో అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఈ భవనాన్ని నిర్మించాలనే ఆలోచన రికార్డో కానో గ్వాపో టాన్ ఆలోచన. అతని భార్య మొదట రిసార్ట్ భూమిని కొనుగోలు చేసింది. దీనిపై భారీ కోళ్ల భవనాన్ని నిర్మించే పనులు ప్రారంభించారు. ఆరు నెలల ప్రణాళికతో ఈ భవనాన్ని పూర్తి చేసినట్టుగా వివరించారు. జూన్ 10, 2023న నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇది 8 సెప్టెంబర్ 2024న పూర్తయింది. ఈ నిర్మాణం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ (GWR) సంపాదించింది.

ఈ హోటల్‌ను నిర్మించే బృందానికి అత్యంత సవాల్‌తో కూడిన విషయం ఏంటంటే.. తుఫానుల ధాటికి తట్టుకుని నిలబడేలా ఈ భవనాన్ని ఎలా పటిష్టంగా చేయాలనేది. ఎంతో నైపుణ్యంతో అన్ని పరిస్థితులను ఎదుర్కోగల సామర్థ్యంతో ఈ భవనాన్ని నిర్మించారు. దీంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఈ భవనాన్ని స్ఫూర్తిగా ఎంచుకుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి