Twitter: రైతు ఆందోళనలపై తప్పుడు ప్రచారాలు.. కేంద్రం నోటీసులపై స్పందించిన ట్విట్టర్..

|

Feb 09, 2021 | 11:47 AM

ఢిల్లీలో రైతు నిరసనల నేపథ్యంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్న సోషల్ మీడియా ఖాతాలపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతుల నిరసనలపై తప్పుడు ప్రచారాలు చేస్తూ

Twitter: రైతు ఆందోళనలపై తప్పుడు ప్రచారాలు.. కేంద్రం నోటీసులపై స్పందించిన ట్విట్టర్..
Twitter
Follow us on

ఢిల్లీలో రైతు నిరసనల నేపథ్యంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్న సోషల్ మీడియా ఖాతాలపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతుల నిరసనలపై తప్పుడు ప్రచారాలు చేస్తూ.. విద్వేషాలను రెచ్చగొడుతున్న అకౌంట్లపై వెంటనే చర్యలను తీసుకోవాలని ట్విట్టర్‏కు ఇటీవల కేంద్రం నోటిసులు పంపింది. నిరసనల పట్ల తప్పుడు ప్రచారాలు చేస్తున్న 1,178 అకౌంట్లను వెంటనే నిలిపివేయాలని కేంద్రం ట్విట్టర్‏ను కోరింది. తాజాగా కేంద్ర నోటిసులపై ట్విట్టర్ స్పంధించింది.

ఈ మేరకు ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్‏తో చర్చించారు. తమ నిబంధనలు, స్థానిక చట్టాల ప్రకారమే నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది. నిబంధనలు పాటించను పోస్టులను తోలగిస్తామని తెలిపింది. అలాగే స్థానిక చట్టాలకు విరుద్ధంగా ఉండే పోస్టులను సోషల్ మీడియా నుంచి తొలగిస్తామని వెల్లడించింది. పోస్టుల పై వస్తున్న ఫిర్యాదుల సమాచారాన్ని అకౌంట్ హోల్డర్స్‏కు తెలియజేస్తామని తెలిపింది. తమ ఉద్యోగుల రక్షణకు తాము ప్రాముఖ్యత ఇవ్వనున్నట్లుగా పేర్కోంది.

Also Read: రైతు సంఘాలతో చర్చలకు కేంద్రం రెడీ, డిసెంబరు 3 న వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ భేటీ