Air India Case: ఎయిర్‌ ఇండియా కేసులో కొత్త ట్విస్ట్‌..! మూత్రం తానుపోయలేదన్న నిందితుడు మిశ్రా..! ఎవరంటే..

|

Jan 13, 2023 | 8:04 PM

ఘటనపై దర్యాప్తు కోసం అంతర్గత కమిటీని సైతం ఏర్పాటు చేసింది. పోలీసులు బెంగళూరులో శంకర్‌ మిశ్రాను అదుపులోకి తీసుకొని.. ఢిల్లీ కోర్టులో హాజరుపరుచగా.. 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది.

Air India Case: ఎయిర్‌ ఇండియా కేసులో కొత్త ట్విస్ట్‌..! మూత్రం తానుపోయలేదన్న నిందితుడు మిశ్రా..! ఎవరంటే..
Twist In Air India
Follow us on

ఎయిర్‌ ఇండియా విమానంలో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన ఘటనకు సంబంధించిన కేసులో కొత్త ట్విస్ట్‌ నెలకొంది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శంకర్‌ మిశ్రా శుక్రవారం ఢిల్లీ కోర్టులో సమాధానం దాఖలు చేశారు. సదరు వృద్ధ మృహిళపై తాను మూత్ర విసర్జన చేయలేదని స్పష్టం చేశాడు. తనపై ఇలాంటి ఆరోపణలు చేసిన సదరు వృద్ధురాలు తనపై తానే మూత్రం పోసుకున్నట్లు చెప్పాడు. శంకర్ మిశ్రా చేసిన ఈ షాకింగ్‌ కామెంట్‌తో కేసులో కొత్త మలుపు సంతరించుకుంది. ఆశ్చర్యకరమైన యూ-టర్న్‌లో తాను ఆ అభ్యంతరకర చర్యకు పాల్పడలేదని శుక్రవారం ఢిల్లీ కోర్టుకు తెలిపారు.

గత ఏడాది నవంబరు 26న ఎయిర్ ఇండియా న్యూయార్క్-న్యూఢిల్లీ విమానంలో ఈ సంఘటన జరిగింది. న్యూయార్క్‌లోని జాన్‌ ఎఫ్‌ కెన్నెడీ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి ఎయిర్‌ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఓ తాగుబోతు తన సీటు వద్దకు వచ్చి మూత్ర విసర్జన చేసినట్లు ఎయిర్‌ ఇండియా చైర్మన్‌కు సదరు మహిళ లేఖ ద్వారా ఫిర్యాదు చేసింది. బట్టలు, బ్యాగులు, బూట్లు పూర్తిగా మూత్రంతో తడిసిపోయాయని మహిళ ఆరోపించింది. ఈ విషయాన్ని సిబ్బంది దృష్టికి తీసుకెళితే ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన తర్వాత వెళ్లిపోయినట్లు నిందితుడు పారిపోయాడు అంటూ ఆరోపించింది. ఆ తర్వాత ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎయిర్‌ ఇండియా తెలిపింది. ఘటనపై దర్యాప్తు కోసం అంతర్గత కమిటీని సైతం ఏర్పాటు చేసింది. పోలీసులు బెంగళూరులో శంకర్‌ మిశ్రాను అదుపులోకి తీసుకొని.. ఢిల్లీ కోర్టులో హాజరుపరుచగా.. 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది.

ఈ క్రమంలోనే నిందితుడి తరఫు న్యాయవాది అడిషనల్ సెషన్స్ జడ్జి హర్జ్యోత్ సింగ్ భల్లా ముందు వాదిస్తూ, పోలీసులు అతనిని కస్టడీలో ఉంచడాన్ని నిరాకరిస్తూ మెజిస్టీరియల్ కోర్టు జారీ చేసిన ఆర్డర్‌ను సవరించాలని కోరుతూ ఢిల్లీ పోలీసు పిటిషన్‌పై వాదించారు. పోలీసుల పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలంటూ సెషన్స్‌ కోర్టు నోటీసులు జారీ చేయగా.. నిందితుడు శంకర్‌మిశ్రా తరఫున న్యాయవాది కోర్టు కు సమాధానం ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

నిందితుడుగా ఆరోపించబడిన శంకర్‌ మిశ్రా మూత్ర విసర్జన చేసింది తాను కాదని, ఆ మహిళే మూత్రం పోసుకుందని, ప్రొస్టేట్‌ సంబంధిత సమస్యలతో బాధపడుతుందని, అలాంటి వారు ఇలా చేసుకోవడం సహజమేనని చెప్పాడు. అంతే కాకుండా వృద్ధురాలి సీటు వద్దకు వెళ్లలేని విధంగా సీటింగ్‌ మూలన ఉందని, అక్కడికి వెళ్లినా సీటు వెనుక వైపు నుంచి మాత్రమే వెళ్లగలరని, నేను మద్యం మత్తులో ఆమె సీటు వద్దకు వెళ్లినా.. మూత్ర విసర్జన చేశానంటే వెనుక సీట్లో కూర్చున్న వారు ఫిర్యాదు చేయాలి కదా? అంటూ ప్రశ్నించాడు. దీంతో కేసు కొత్త మలుపు తీసుకున్నట్టయింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..