AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టర్కీకి వందల కోట్ల నష్టం! సామాన్య భారతీయుల దెబ్బ అదుర్స్‌ కదూ..!

భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో టర్కీ పాకిస్తాన్‌కు మద్దతు ఇవ్వడంతో భారతదేశంలో టర్కీ వస్తువుల బహిష్కరణ జరుగుతోంది. ముఖ్యంగా టర్కీ యాపిల్స్ కు డిమాండ్ 50 శాతం దాకా తగ్గింది. దీంతో టర్కీకి కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

టర్కీకి వందల కోట్ల నష్టం! సామాన్య భారతీయుల దెబ్బ అదుర్స్‌ కదూ..!
Pakistan Pm And Turkey Pm
SN Pasha
|

Updated on: May 16, 2025 | 6:13 PM

Share

భారత్‌, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు, పాకిస్తాన్‌కు మొదట మద్దతు ఇచ్చింది టర్కీ(తుర్కియో). దీంతో ఇండియాలో టర్కీపై వ్యతిరేకత పెరిగింది. టర్కీ యాపిల్స్‌ను చిన్న వ్యాపారులు కూడా బహిష్కరించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. ఆ తర్వాత పాకిస్తాన్ భారతదేశంపై దాడి చేసింది. కొన్ని నివేదికల ప్రకారం.. ఈ దాడులకు టర్కీ పాకిస్తాన్‌కు సహాయం చేసింది, వారికి డ్రోన్లు సరఫరా చేసిందని సమాచారం. దీంతో ఇండియాలో బాయ్‌కాట్‌ టర్కీ క్యాంపెయిన్‌ ఊపందుకుంది. అయితే టర్కీ యాపిల్స్‌ను బహిష్కరించడం వల్ల టర్కీకి వందల కోట్ల నష్టం వటిల్లుతున్నట్లు సమాచారం.

2021-22లో రూ.563 కోట్ల విలువైన యాపిల్స్ టర్కీ నుండి భారతదేశానికి దిగుమతి అయ్యాయి. 2022-23లో రూ.739 కోట్ల విలువైన యాపిల్స్, 2023-24లో రూ.821 కోట్ల విలువైన యాపిల్స్ దిగుమతి అయ్యాయి. ఇలా టర్కీ నుండి యాపిల్స్‌ దిగుమతి పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం ఉన్నా.. ప్రస్తుతం పరిస్థితుల్లో దిగుమతి గణనీయంగా తగ్గింది.

50 శాతం తగ్గిన డిమాండ్‌

టర్కీ యాపిల్స్ నాణ్యత, తక్కువ ధర కారణంగా భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందాయి. కానీ ఇటీవలి కాలంలో బహిష్కరణ ఉద్యమం పెరిగింది. దీని కారణంగా డిమాండ్ 50 శాతం వరకు తగ్గింది. బహిష్కరణ కారణంగా పండ్ల వ్యాపారులు ఇప్పుడు కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, వాషింగ్టన్, ఇరాన్, న్యూజిలాండ్ నుండి యాపిల్స్‌ను దిగుమతి చేసుకుంటున్నారు.

టర్కీకి భారీ నష్టాలు..?

దీని కారణంగా టర్కీ భారీ నష్టాలను చవిచూస్తుంది. సీజన్ లేని సమయంలో కూడా భారత మార్కెట్లలో టర్కిష్ యాపిల్స్‌కు డిమాండ్ ఉంటుంది. కానీ, ప్రస్తుతం అంతా కాయ్‌కాట్‌ టర్కీ అంటూ టర్కీ యాపిల్స్‌ను దిగుమతి చేసుకోవడం లేదు, చిన్న వ్యాపారులు కూడా టర్కీ యాపిల్స్‌ను కొనుగోలు చేసి అమ్మడానికి ఆసక్తి చూపించడం లేదు. స్వచ్ఛందంగా వాటిని బాయ్‌కాట్‌ చేస్తున్నారు. దీంతో టర్కీకి ఈ ఏడాది దాదాపు రూ.821 కోట్ల నష్టం వాటిల్లే అవకావం ఉన్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.

ఏడు ఫ్లాప్‌ల తర్వాత నాగార్జునకు హిట్ ఇచ్చిన చిత్రం ఏదో తెలుసా.?
ఏడు ఫ్లాప్‌ల తర్వాత నాగార్జునకు హిట్ ఇచ్చిన చిత్రం ఏదో తెలుసా.?
ఇండస్ట్రీని మార్చేస్తున్న వైరల్ వయ్యారి.. కారణం అదేనా?
ఇండస్ట్రీని మార్చేస్తున్న వైరల్ వయ్యారి.. కారణం అదేనా?
భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..
మూత్రం రంగు మారుతోందా? ఆ వ్యాధికి సంకేతామా? ఏంటో తెలిస్తే..
మూత్రం రంగు మారుతోందా? ఆ వ్యాధికి సంకేతామా? ఏంటో తెలిస్తే..
47 వయసులో ఇండస్ట్రీని ఊపేస్తున్న హీరోయిన్..
47 వయసులో ఇండస్ట్రీని ఊపేస్తున్న హీరోయిన్..
పళ్లు తోముకోవడానికి బ్రష్‌ నిండా టూత్‌ పేస్ట్‌ వేసుకుంటున్నారా?
పళ్లు తోముకోవడానికి బ్రష్‌ నిండా టూత్‌ పేస్ట్‌ వేసుకుంటున్నారా?
ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు...!
ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు...!
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్