Jammu Kashmir – TTD: జమ్ములో శ్రీవారి ఆలయం ప్రారంభం.. దర్శనానికి పోటెత్తిన భక్తజనం..

జమ్ములో శ్రీవారి ఆలయ మహా సంప్రోక్షణం ఘనంగా జరిగింది. జమ్ము లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా టీటీడీ ఆలయాలన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి , జితేంద్రసింగ్‌తో పాటు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు. తొలిరోజే స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు.

Jammu Kashmir - TTD: జమ్ములో శ్రీవారి ఆలయం ప్రారంభం.. దర్శనానికి పోటెత్తిన భక్తజనం..
Ttd Jammu And Kashmir

Updated on: Jun 08, 2023 | 3:01 PM

జమ్ములో శ్రీవారి ఆలయ మహా సంప్రోక్షణం ఘనంగా జరిగింది. జమ్ము లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా టీటీడీ ఆలయాలన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి , జితేంద్రసింగ్‌తో పాటు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు. తొలిరోజే స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు.

జమ్ము లోని మాజిన్‌ గ్రామంలో స్వామి వారి ఆలయాన్ని టీటీడీ సర్వాంగసుందరంగా నిర్మించింది. 30 కోట్ల వ్యయంతో 62 ఎకరాల్లో ఆలయాన్ని నిర్మించారు. అందమైన శివాలిక్ అడవుల మధ్య శ్రీ వేంకటేశ్వర ఆలయం భక్తులకు అందుబాటులోకి వచ్చింది.

ఈ ఆలయం జమ్మూ ప్రాంతంలోని అతిపెద్ద దేవాలయాలలో ఒకటి. జమ్మూలోని ఈ గుడి ఆంధ్రప్రదేశ్ వెలుపల నిర్మించిన ఆరో శ్రీ వేంకటేశ్వర ఆలయం. మిగతా ఐదు ఆలయాలను తిరుమల తిరుపతి దేవస్థానం హైదరాబాద్, చెన్నై, కన్యాకుమారి, ఢిల్లీ, భువనేశ్వర్ లలో నిర్మించింది. రాయ్ పూర్, అహ్మదాబాద్ లలో కొత్త ఆలయాలు కూడా నిర్మించనుంది.

ఇవి కూడా చదవండి

జమ్మూ లో శ్రీ వేంకటేశ్వర్ ఆలయాన్ని భక్తుల కోసం ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలో అనుసరిస్తున్న విధానం, ఆచారాన్ని జమ్మూ ఆలయంలో కూడా అనుసరిస్తామన్నారు. ఈ పవిత్ర స్థలంలో తిరుపతి బాలాజీ ఆలయాన్ని టీటీడీ నిర్మించిందని తెలిపారు. కాగా.. ఆ ఆలయ ప్రాంగణంలో టీటీడీ ప్రధాన ఆలయ సముదాయంతో పాటు ఉపాలయాలు, పోటు కిచెన్ ఏరియా, అన్నప్రసాదం కౌంటర్లు తదితరాలను నిర్మించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..