జన్‌ధన్‌ ఖాతాదారులకు షాక్‌.. ఖాతాల నుంచి నగదు వెనక్కి..!

తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 3లక్షల జన్‌ధన్‌ ఖాతాలకు పీఎంజీకేవై కింద జమ చేసిన నగదును తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌(టీజీబీ) వెనక్కు తీసుకుంది.

జన్‌ధన్‌ ఖాతాదారులకు షాక్‌.. ఖాతాల నుంచి నగదు వెనక్కి..!
Follow us

| Edited By:

Updated on: Apr 28, 2020 | 7:51 PM

తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 3లక్షల జన్‌ధన్‌ ఖాతాలకు పీఎంజీకేవై కింద జమ చేసిన నగదును తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌(టీజీబీ) వెనక్కు తీసుకుంది. ఈ నగదును అందుకున్న వారిలో అనర్హులను గుర్తించిన బ్యాంక్‌ దాదాపు రూ.16కోట్లకు పైగా వెనక్కి తీసుకుంది. ఈ విషయాన్ని తెలంగాణ గ్రామీణ బ్యాంకు జీఎం మహేష్‌ తెలిపారు. 2014 ఆగష్టు 1 తరువాత ప్రారంభించిన ఖాతాలనే అర్హులుగా తేల్చినట్లు ఆయన స్పష్టం చేశారు. పొరపాటుతో డబ్బులను అనర్హులకు జమ చేశామని.. ఆ తరువాత గుర్తించి వెనక్కి తీసుకున్నామని జీఎం తెలిపారు. అనర్హుల్లో లక్షకు పైగా ఖాతాదారులు నగదును తీసుకున్నారని.. వారి నుంచి తిరిగి రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు.

కాగా కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ నేపథ్యంలో జన్‌ధన్‌ ఖాతాల్లో నెలకు రూ.500 చొప్పున మూడు నెలల పాటు జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ నెల మొదటివారంలో దేశవ్యాప్తంగా జన్‌ధన్ ఖాతాదారులు అకౌంట్లో జమ చేసింది. ఈ క్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు పరిధిలోని 473 శాఖాల్లో సుమారు 9లక్షల మంది ఖాతాల్లో రూ.500 చొప్పున జమ అయ్యాయి. వీరిలో 5,15,260 మంది మినహా మిగిలిన వారిని అనర్హులుగా బ్యాంకు తేల్చింది.

Read This Story Also: Breaking: అస్వస్థతకు గురైన ఇర్ఫాన్‌.. ఐసీయూలో చికిత్స..!