భారత్, పాక్ యుద్ధంలో ఎన్ని ఫైటర్ జెట్‌లు కూలిపోయాయి..? డొనాల్డ్ ట్రంప్ షాకింగ్ స్టేట్‌మెంట్!
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ 'ఆపరేషన్ సింధూర్' ద్వారా పాకిస్తాన్‌పై వైమానిక దాడి చేసింది, ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. పాక్ ప్రతీకార దాడులను తిప్పికొట్టి, వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాక, కాల్పుల విరమణ ప్రకటించాయి. తాజాగా, భారత్-పాక్ యుద్ధంలో ఏడు విమానాలు కూలాయని ట్రంప్ వ్యాఖ్యానించారు.

పహల్గామ్‌లో ఒక పెద్ద ఉగ్రదాడి జరిగింది. ఆ తర్వాత భారత్, పాకిస్తాన్‌పై వైమానిక దాడి చేసింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్, పాకిస్తాన్‌లలో నిర్వహించిన ఈ వైమానిక దాడిలో అనేక ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయి. భారతదేశం ఈ వైమానిక దాడికి ఆపరేషన్ సిందూర్ అని పేరు పెట్టింది. ఈ వైమానిక దాడిలో పాకిస్తాన్‌లోని వంద మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు. ఆపరేషన్ సిందూర్‌కు ప్రతిదాడిగా పాక్ సైతం సరిహద్దుల్లో కాల్పులకు తెగబడింది. రెండు దేశాల మధ్య చాలా ఉద్రిక్తత నెలకొంది.
పాకిస్తాన్ భారత్‌పై దాడి చేయడానికి విఫలయత్నం చేసింది. అయితే భారత సైన్యం పాకిస్తాన్ దాడులను తిప్పికొట్టింది, అనేక పాకిస్తాన్ డ్రోన్లను కాల్చివేసింది, దీనివల్ల పాకిస్తాన్‌కు భారీ నష్టం వాటిల్లింది. ఇంతలో పాకిస్తాన్ దాడి తర్వాత, భారతదేశం పాకిస్తాన్‌పై జరిపిన ప్రతీకార దాడిలో అనేక పాకిస్తాన్ వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఇది పాకిస్తాన్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరి ఒక యుద్ధం తప్పదేమో అనే టైమ్‌లో భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణ ప్రకటించాయి. కాల్పుల విరమణ ప్రకటించేటప్పుడు, భారతదేశం పాకిస్తాన్ ముందు కొన్ని షరతులు ఉంచింది, కానీ మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మధ్యవర్తిత్వం కారణంగా రెండు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించాయని పేర్కొన్నారు.
ఇప్పుడు తాజాగా మరో షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. భారత్-పాకిస్తాన్ యుద్ధంలో ఎన్ని విమానాలు కూలిపోయాయి? అనే దానిపై ట్రంప్ మాట్లాడారు. భారత్-పాకిస్తాన్ యుద్ధంలో మొత్తం ఏడు యుద్ధ విమానాలు కూలిపోయాయని ఆయన అన్నారు. అయితే మరి ఆ విమానాలు ఎవరివి అనే దానిపై ఆయన క్లారిటీ ఇవ్వలేదు. మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వాదన చేశారు. అలాగే రష్యా నుండి భారతదేశం ముడి చమురు కొనుగోలు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు, ఈ చమురు కొనుగోలు ఆగకపోతే, దానిపై అధిక సుంకాలు విధిస్తామని ఆయన మరోసారి హెచ్చరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




