AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు గ్యాంగ్‌స్టర్లు హతం

ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో బుధవారం రాత్రి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. క్రైమ్ బ్రాంచ్, బీహార్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఎన్‌కౌంటర్‌లో బీహార్‌కు చెందిన నలుగురు గ్యాంగ్‌స్టార్లు హతం అయ్యారు. మృతుల్లో అత్యంత మోస్ట్ వాంటెడ్ నేరస్థుడైన రంజన్ పాఠక్ కూడా ఉన్నాడు. ఈ ఘటన ఢిల్లీలో కలకలం రేపింది..

భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు గ్యాంగ్‌స్టర్లు హతం
Delhi Encounter
Srilakshmi C
|

Updated on: Oct 23, 2025 | 7:46 AM

Share

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 23: ఢిల్లీలోని రోహిణిలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఎన్‌కౌంటర్‌లో బీహార్‌కు చెందిన నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు హతమయ్యారు. హాతుల్లో గ్యాంగ్ లీడర్ రంజన్ పాఠక్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో బుధవారం (అక్టోబర్‌ 22) రాత్రి ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ – బీహార్ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో మొత్తం నలుగురు గ్యాంగ్‌స్టర్లు హతమయ్యారు.

రాజధానిలో ఈ ముఠా కదలికలపై నిఘా వర్గాలు అందించిన సమాచారం మేరక ఈ ఎన్‌కౌంటర్ నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున 2:20 గంటలకు ఈ కాల్పులు జరిగాయి. ఎన్‌కౌంటర్‌లో మరణించిన గ్యాంగ్‌స్టర్లను.. రంజన్ పాఠక్ (25), బిమ్లేష్ మహ్తో అలియాస్ బిమ్లేష్ సాహ్ని (25), మనీష్ పాఠక్ (33), అమన్ ఠాకూర్ (21)గా పోలీసులు గుర్తించారు. ఈ నలుగురు నిందితులు బీహార్‌లో అనేక క్రిమినల్ కేసుల్లో వాంటెడ్‌ లిస్ట్‌లో ఉన్నారు. ‘సిగ్మా & కంపెనీ’ పేరుతో చెలరేగుతున్న ఈ ముఠాకు రంజన్ పాఠక్ వహిస్తున్నాడు. బీహార్‌లో నమోదైన అనేక కేసుల్లో ఈ నలుగురు పరారీలో ఉన్నారు. అక్టోబర్ అర్ధరాత్రి బీహార్ పోలీసులు, ఢిల్లీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ సంయుక్తంగా రోహిణిలోని డాక్టర్ అంబేద్కర్ చౌక్, పన్సాలి చౌక్ మధ్య ఉన్న ప్రాంతంలో బహదూర్ షా మార్గ్‌లో నలుగురు గ్యాంగ్‌స్టర్లను ఢిల్లీ పోలీసులు కాల్చి చంపారు.

బీహార్ ఎన్నికలకు ముందు ఈ నలుగురు పెద్ద కుట్రకు ప్రణాళిక వేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇంతలో ఢిల్లీ, బీహార్ పోలీసు బృందాలు వారిని ఎన్‌కౌంటర్‌లో హతమార్చడం విశేషం. కాగా ఢిల్లీలోని కరావాల్ నగర్‌కు చెందిన అమన్ ఠాకూర్ తప్ప, మిగిలిన ముగ్గురు గ్యాంగ్‌స్టర్లు బీహార్‌లోని సీతామర్హికి చెందినవారిగా పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.