
Tree Man Devender Sura: ప్రతిరోజూ మనం పర్యావరణ దినోత్సవం జరుపుకోవాలి. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ట్రీమ్యాన్ దేవేంద్ర సుర పిలుపునిచ్చారు. పక్షులు, జంతువులతో మమేకం అవ్వాలని కోరారు. విదేశాల్లో మాదిరిగా సైకిల్ ను వినియోగించాలి. వాతావరణాన్ని స్వచ్ఛంగా ఉంచాలి. తన దినచర్యను మార్చుకునే వ్యక్తికి ప్రతిరోజూ పర్యావరణ దినోత్సవమేనని నేను భావిస్తాను. అప్పుడే భారత్ వర్ష్ పచ్చగా స్వచ్ఛంగా విరాజిల్లుతుందని దేవేంద్ర సుర అభిప్రాయపడ్డారు. పర్యావరణం కోసం మార్పులు అవసరమని పేర్కొన్నారు.
హరియాణాకు చెందిన పోలీసు కానిస్టేబుల్ దేవేంద్ర సుర పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్నారు. చేసేది ఉద్యోగమైనా పర్యావరణం కోసం ఎంతో కృషిచేస్తున్న సోనిపట్ నివాసి దేవేంద్ర సురకు హరియాణా ట్రీమ్యాన్ అనే పేరుంది. ఇప్పుడు ఆయన ఆలోచన చుట్టు పక్కల ప్రాంతాల్లో ప్రజా ఉద్యమంగా మారింది. ట్రీమ్యాన్ దేవేంద్ర సుర కృషితో చుట్టు గ్రామాల ప్రజల్లో పర్యావరణంపై మరింత అవగాహాన పెరిగింది.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఏటా జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. జూన్ 5, 1973 నుంచి ఈ ఉద్యమం కొనసాగుతోంది. 50వ పర్యావరణ దినోత్సవం సందర్భంగా.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా మై ఇండియా – మై లైఫ్ గోల్స్ పేరుతో లైఫ్‌స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ మూవ్‌మెంట్ – లైఫ్ అనే నినాదంతో భారత్ పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పర్యావరణ హితం కోసం భారత ప్రభుత్వం చేపట్టిన ఈ ఉద్యమంలో టీవీ9 భాగస్వామిగా ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..